ముంబై: ఇండియా మెడ్ ట్రానిక్ ప్రై.లి. వైస్ ప్రెసిడెంట్ గా మైఖేల్ బ్లాక్ వెల్ ను నియమించినట్లుగా మెడ్ ట్రానిక్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ ఇటీవల ప్రకటించింది. 2023 జనవరి నుంచి వర్తించేలా ఈ నియామకం అమల్లోకి వచ్చింది. ఈ పాత్రలో ఆయన మెడ్ ట్రానిక్స్ ఇండియా కార్యకలాపాలకు సంబం ధించి విక్రయాలు, మార్కెటింగ్, వాణిజ్య కార్యకలాపాలకు బాధ్యత వహిస్తారు. త్వరలోనే ఆయన మెడ్ ట్రానిక్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ గా నియమితులు కానున్నారు.
డైనమిక్ భారతీయ మార్కెట్ కు సారథ్యం వహించిన మదన్ కృష్ణన్ స్థానంలో మైఖేల్ బాధ్యతలు నిర్వహించను న్నారు. మదన్ ఇప్పుడు అమెరికాలో మెడ్ ట్రానిక్స్ మెడికల్ సర్జికల్ పోర్ట్ ఫోలియో వైస్ ప్రెసిడెంట్, సీఎఫ్ఒగా గ్లోబల్ పాత్ర పోషించనున్నారు. గత ఆరేళ్లుగా మదన్ భారత్, దక్షిణాసియా లో మెడ్ ట్రానిక్స్ పరివర్తనదాయక వృద్ధి కార్యక్రమాలకు సారథ్యం వహించారు. నూతన సాంకేతికతలు, సేవలు, పరిష్కారాలు ప్రవేశపెట్టడం ద్వారా నాణ్యమైన ఆరోగ్యసంరక్షణను అందించేందుకు మెరుగైన యాక్సెస్ కల్పించేందుకు వీలుగా ప్రభుత్వం, ఆరోగ్య సంరక్షణ కమ్యూనిటీ, కార్పొరెట్ సంస్థలు, విద్యాసంస్థలు, పరిశ్రమ సంఘాలు కలసి పని చేసే ఆరోగ్యసంరక్షణ ఆవరణ వ్యవస్థ కోసం ఆయన పని చేశారు, దానికి అండగా నిలిచారు. అంతిమంగా అది రోగులకు మెరుగైన ఫలితాలను అందిస్తుంది. అడ్వామెడ్ ఇండియాకు అధ్యక్షుడిగా కూడా ఆయన పని చేశారు.
మైఖేల్ 2006లో మెడ్ ట్రానిక్ లో చేరారు. అంతర్జాతీయంగా వివిధ మార్కెట్లలో పని చేశారు. ఆరోగ్య సంరక్షణ రంగంలో 20 ఏళ్ల కెరీర్ తో ఆయన మెడ్ ట్రానిక్ బిజినెస్ గ్రూప్ లలో పని చేశారు. కార్డియోవాస్క్యులర్, న్యూరో సైన్స్, మెడికల్ సర్జికల్ వంటివి వీటిలో ఉన్నాయి. మెడ్ ట్రానిక్ లో తన చివరి అసైన్ మెంట్ లో ఆయన ఇండో నేషియా, ఫిలిప్పీన్స్, బంగ్లాదేశ్, శ్రీలంక, గువామ్, బ్రూనై, నేపాల్, మాల్దీవ్స్, భూటాన్, ఫిజి, న్యూ పపా గుని యాలతో కూడిన ఫ్రంటియర్ మార్కెట్లకు సారథ్యం వహించారు. కొంతకాలంగా డైనమిక్ ఇండియా మార్కెట్ కు నేతృత్వం వహించిన మదన్ కృష్ణన్ స్థానంలో మైఖేల్ వచ్చారు. మెడ్ ట్రానిక్ లో ఆయన అంతర్జాతీయ విధుల కు మారిపోనున్నారు.
ఈ సందర్భంగా మెడ్ ట్రానిక్ గ్లోబల్ రీజియన్స్ ఏషియా రీజియన్–లెడ్ మార్కెట్స్ వైస్ ప్రెసిడెంట్ ఫెంగ్ డాంగ్ మాట్లాడుతూ, ‘‘మైఖేల్ ప్రతిభావంతుడైన ఎగ్జిక్యూటివ్. వివిధ మార్కెట్లు, థెరపీల వైవిధ్యభరిత అనుభవాన్ని ఆయన కలిగిఉన్నారు. వివిధ భౌగోళిక ప్రాంతాల్లో వృద్ధి సాధనకు, వివిధ మార్కెట్ డైనమిక్స్ కు సంబంధించి ఆయన నిరూపిత ట్రాక్ రికార్డు కలిగిఉన్నారు. ఆయన దృక్పథాలు, వినూత్నత చోదిత మైండ్ సెట్, పటిష్ఠ నాయ కత్వ నైపుణ్యాలు మా భారతీయ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు, అగ్రగామి ఆరోగ్యసంరక్షణ సాంకేతిక కంపెనీగా మెడ్ ట్రానిక్స్ స్థానాన్ని పటిష్ఠం చేసుకునేందుకు తోడ్పడుతాయి’’ అని అంటారు.
“నా కొత్త పాత్ర పట్ల నేను సంతోషిస్తున్నాను. నొప్పిని తగ్గించడం, ఆరోగ్యాన్ని పునరుద్ధరించడం, జీవితాలను పొడిగించడం అనే మా మిషన్‌కు దోహదపడగలగాలి. మెడ్‌ట్రానిక్ నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను అందించే, రోగుల ఫలితాలను మెరుగుపరిచే ఆవిష్కరణలు, ఉత్పాదనల ద్వారా 40 సంవత్సరాలుగా భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ తీరుతెన్నులను మారుస్తోంది. నేను టీమ్‌లతో కలిసి పనిచేయడానికి, మా కస్టమర్‌లు, భాగస్వాములతో కలిసి భారతదేశ ఆరోగ్య సంరక్షణ రంగానికి గొప్ప మైలురాళ్లను సాధించడానికి, రోగులకు మెరుగైన ఫలితాలను సాధించడానికి ఎదురుచూస్తున్నాను” అని మెడ్‌ట్రానిక్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మైఖేల్ బ్లాక్‌వెల్ అన్నా రు.
మైఖేల్ యొక్క మునుపటి అసైన్‌మెంట్‌లలో మెడ్‌ట్రానిక్ కెనడాలో కార్డియోవాస్కులర్ గ్రూప్‌నకు నాయకత్వం వహించడం లాంటివి ఉన్నాయి. మెడికల్ సర్జికల్ బిజినెస్ గ్రూప్‌లో అడ్వాన్స్ డ్ సర్జికల్ డివిజన్, వెస్ట్ ఏరియా సేల్స్ వైస్ ప్రెసిడెంట్‌గా, అదే గ్రూప్ లో నేషనల్ హెర్నియా లీడ్ గా ఆయన యునైటెడ్ స్టేట్స్ లో ద్వంద్వ బాధ్య తలను కూడా నిర్వహించారు. అదనపు విధి నిర్వహణల్లో మెడ్‌ట్రానిక్ పోర్ట్ ఫోలియోలలో బహుళ మేనేజర్ స్థానాలతో పాటు వ్యూహాత్మక ఖాతాల డైరెక్టర్ లాంటివి ఉన్నాయి.
అదనంగా, మైఖేల్ మెడ్‌ట్రానిక్ ఎంప్లాయీ రిసోర్స్ గ్రూప్స్ లో క్రియాశీల పాత్ర పోషించారు: ఆఫ్రికన్ డిసెంట్ నెట్ వర్క్ (ADN)లో నాయకత్వ స్థానం, మెడ్‌ట్రానిక్ – ఫీల్డ్ యాక్సిలరేషన్ రిసోర్స్ గ్రూప్ (AIM – FAR) లో ఆసి యా ఇంపాక్ట్ కు అనుసంధానకర్తగా ఉన్నారు. ఇన్నోవేషన్ రిజల్ట్స్ అండ్ ఎక్సలెన్స్ (ASPIRE) ద్వారా మెడ్ ట్రానిక్ ఈఆర్జీ అయిన యాక్సిలరేటింగ్ అండ్ అడ్వాన్సింగ్ సేల్స్ ప్రొఫెషనల్స్ కు అండగా నిలిచారు. ఇది మహిళా ఫీల్డ్ ఉద్యోగుల ఉన్నతి, అభివృద్ధి, విజయంపై దృష్టి సారిస్తుంది.
మిడ్‌వెస్ట్, టోపెకా, కాన్సాస్ (యునైటెడ్ స్టేట్స్)లో మైఖేల్ పుట్టి పెరిగారు. ఆయన వాషింగ్టన్ డీసీలోని అమెరికన్ విశ్వవిద్యాలయంలో చదివారు. మైఖేల్ ప్రయాణాలు, సాహసాలు, కొత్త విషయాల పట్ల మక్కువ కలిగి ఉంటారు. ఆయన గురించి అంతగా తెలియని వాస్తవం ఏమిటంటే, అతను డిసెంబర్ 2016 నుండి ఓపెన్-హార్ట్ సర్జరీ ద్వారా మెడ్‌ట్రానిక్ హాన్‌కాక్ ™ II బయోప్రోస్టెటిక్ హార్ట్ వాల్వ్ ను తన ఛాతీ లోపల కలిగిఉన్నారు, అది అతని ప్రాణాన్ని కాపాడింది. మెడ్‌ట్రానిక్ భారతదేశంలో తన కార్యకలాపాలను 1979 సంవత్సరంలో ప్రారంభించింది. ఇండియా మెడ్‌ట్రానిక్ ప్రై.లి. అనేది మెడ్‌ట్రానిక్ పీఎల్సీ పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థ. దీని ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది.