నల్లగొండ/ చింతపల్లి : మండల పరిధిలోని చాకలిశేరిపల్లి గ్రామ శివారులో ఉన్న పిఎస్ వి పలుగు రాయి కంపెనీ నుండి దుమ్ము బయటికి వెదజల్లుతూ ఆ గ్రామ ప్రజలకు, మూగ జీవాలకు యమ పాశంగా మారింది. మంగళవారం చాకలిశేరిపల్లి గ్రామానికి చెందిన బొలగోని అంజయ్యకు చెందినరెండు మేకలు పలుగు రాయి దుమ్ముతో కూడుకున్న ఆ పంట పోలాలను తిని మృతి చెందాయి.
ఆ మేకలను తీసుకొని వెళ్లి గ్రామ ప్రజలు కంపెనీ ముందు దర్నాకు దిగారు. ఇప్పటికి పలుమార్లు పలుగు రాయి దుమ్ముతో నష్టం వాటిల్లుతుందని కంపెనీ నిర్వాహకులకు ఎన్నో సార్లు విన్న వించినప్పటికి నిమ్మకు నీరెత్తినట్లుగా యాజమాన్యం ప్రవర్తిస్తుంది. గతంలో కూడా ఆదె దుమ్ముతో ఉన్న గడ్డిని తిని పలువురి బర్రెలు మృతి చెందాయని గ్రామ ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
అంతేకాకుండా కంపెనీ చుట్టు ప్రక్కల ఉన్న తాటి చెట్లపై పలుగు రాయి దుమ్ము పూర్తిగా నిండుకొని కల్లులో పడుతుండడంతో అదే కల్లు త్రాగిన పలువురు తీవ్ర అస్వస్థకు గురై ఆసుపత్రి పాలవుతున్నారని దీంతో తాము ప్రాణాలు సైతం ఫణంగా పెట్టుకొని తాటి చెట్లు ఎక్కుతుండగా పలుగు రాయి దుమ్ముతో ఎవరు త్రాగక తమకు ఉపాదీ లేకుండా పోతుందని గీత కార్మికులు లబోదిబో మంటున్నారు. ఇప్పటికైన చాకలిశేరిపల్లి ప్రజలతో, మూగ జీవాల ప్రాణాలతో చెలగాటం మాడుతున్న పలుగురాయి కంపెనీని మూసి వేయించాలని సంభందిత జిల్లా అధికారులను గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు.