- Advertisement -
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీలకు 57,221 దరఖాస్తులు వచ్చినట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి దరఖాస్తు గడువును ప్రభుత్వం బుధవారం(ఫిబ్రవరి 1) వరకు పొడిగించిన నేపథ్యంలో మరిన్ని దరఖాస్తులు వచ్చే అవకాశం కనిపిస్తుంది.
రాష్ట్రంలో ఏడున్నర ఏళ్ల తర్వాత ప్రభుత్వం టీచర్ల బదిలీల ప్రక్రియను చేపట్టిన నేపథ్యంలో బదిలీలకు ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకుంటున్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2015లో జూలై- ఆగస్టులో టీచర్లకు పదోన్నతులు, 2018 జూలైలో 317 జీవో ద్వారా సర్దుబాటు బదిలీలు చేపట్టింది.
- Advertisement -