Sunday, December 22, 2024

మైనారిటీల పట్ల మూర్ఖత్వం

- Advertisement -
- Advertisement -

 

‘భారత దేశ జనాభాలో 15 శాతం ఉన్న ముస్లింలు ఉద్యోగాలలో నామమాత్రంగా ఉన్నారు. మనుగడ కోసం పోరా డే స్థితికి వారిని దిగజార్చుతున్నారు. మైనారిటీలను కించపరిచేలా చూడడం అనేది ఒక జాతిలో ఉన్న పెద్ద మూర్ఖత్వం. అలా చూడకపోవడం వల్ల, సంప్రదాయంలో అదొక పెద్ద భాగంగా ఉండడం వల్ల భారత దేశం అన్నిటి కంటే పెద్దదిగా, గొప్పదిగా, ఏళ్ళ తరబడి అలరారింది’ అని నోబెల్ బహుమతి గ్రహీత, ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త అమర్త్య సేన్ అన్నారు. ప్రముఖ జర్నలిస్టు కరణ్ థాపర్‌కు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో మిగతా భాగం.

కరణ్: మీరు చెప్పిన దాన్ని మరొకసారి గుర్తు చేయదలుచుకున్నా. ఈ పరిస్థితికి మీరు చింతించడమే కాదు, భయకంపితులయ్యారు కూడా. ఈ పరిస్థితిని మనమే కల్పించాం. ఒక దుష్టత్వం పని చేసేలా భయంకరమైన స్థితికి సంబంధించిన విషయంగా మీరు దీన్ని అభివర్ణించారు. మనం చర్చించడానికి నేపథ్యంగా, స్వల్పంగా దీన్ని కాస్త విస్తృతం చేయదలిచాను. నేను చెప్పినట్టు భారత దేశంలో ఇరవై కోట్ల మందికి పైగా ముస్లింలున్నారు. ఇది భారత దేశ జనాభాలో 15 శాతం ఉండడం పెద్ద మైనారిటీ సంఖ్య. కొన్ని దేశాల జనాభా కంటే కూడా ఇది ఎక్కువ. ఆకార్ పటేల్ రాసిన ‘ద అవర్ హిందూ రాష్ర్ట’ లో పేర్కొన్నట్టు ముస్లింల జనాభా 15 శాతం ఉన్నప్పటికీ, కేంద్ర రాష్ర్ట ఉద్యోగాలలో వారి వాటా కేవలం 4.9 శాతం మాత్రమే. పారా మిలటరీ బలగాల్లో 4.6 శాతం, ఐఎఎస్, ఐపిఎస్, ఐఎఫ్‌ఎస్ వంటి ఉన్నతాధికారుల్లో 3.2 శాతం ఉండగా, భారత సైన్యంలో కేవలం ఒక్క శాతం మాత్రమే ఉన్నారు. మీకు రెండు విషయాలు సూచించాలి. మొదటిది, ప్రజాస్వామ్య భారత దేశంలో ముస్లింలు తగిన వాటా పొంద డం లేదు. రెండవది కొత్తదేం కాదు, ఇది చారిత్రక సమస్య. ఈ ప్రభుత్వ ఆధ్వర్యంలో మరింత దారుణంగా తయారైన పరిస్థితి పెరుగుతోంది.

సేన్ : హిందూ, ముస్లిం సంబంధాలకు భారత దేశ చరిత్రలో ప్రధాన పాత్ర ఉంది. ఈ పాత్ర దేశంలోని దాదాపు అన్ని విభాగాలలో; రాజకీయాలలో, సంస్కృతి, సమాజం, సాహిత్యం, సంగీతం వంటి వాటన్నిటిలో ఉంది. ఏదేమైనప్పటికీ 15 శాతం కనిపించడం అన్నది పెద్ద సమస్య కాదు. అధిక సంఖ్యాకుల సహనాన్ని భరించడమే అసలు సమస్య. ఎవరైతే ఈ దేశంలో భాగస్వాములో, వారొక మనుష్యులుగా తమ జీవితాన్ని తాము జీవించేలా కాకుండా చేస్తున్నారు. కాబట్టి, మీరు చెప్పే విషయాల్లో, మైనారిటీలకు సంబంధించి, ముస్లింల విషయంలో భారత దేశంలో వారు చాలా పెద్ద సంఖ్య, దేశంలో ఒక పెద్ద వర్గం కూడా. అది కాదు సమస్య. సమాజంలోని వివిధ రంగాలు ఉభయ శక్తులపైన ఆధారపడి ఉన్నాయి. ఏదైతే మనం తగ్గించడాన్ని చూస్తున్నామో, సమర్ధవంతమైన విధ్వంసం, దేశంలో ఒక భాగం జాతిని అనేక విధాలుగా మరీ చిన్నదిగా, పేదదిగా చేస్తుంది. అత్యంత అసహ్యకరంగా కూడా చేస్తుంది ఎందుకంటే, మనుగడ కోసం పోరాడే స్థితికి దిగజార్చే పరిస్థితులకు నెట్టివేస్తుంది కనుక. మైనారిటీలను కించపరిచేలా చూడడం అనేది ఒక జాతిలో ఉన్న పెద్ద మూర్ఖత్వం. అలా చూడకపోవడం వల్ల, సంప్రదాయంలో అదొక పెద్ద భాగంగా ఉండడం వల్ల భారతదేశం అన్నిటి కంటే పెద్దదిగా, గొప్పదిగా, ఏళ్ళ తరబడి అలరారింది.

కరణ్ : మీరన్నదే చెపుతున్నాను. “మైనారిటీలను కించపరచడం అనేది జాతిలో ఉన్న పెద్ద లోపం” రాజకీయాల్లో కూడా, ఒకానొకప్పుడు మనకు ముస్లిం రాష్ర్టపతులు, హోం మంత్రులు, ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు. ముస్లీంలను మినహాయించడమనేది పెరగడం మనం గమనిస్తున్నాం. వారి జనాభా ప్రాతిపదికగా లోక్‌సభలో 74 సీట్లు ఉండవలసింది కాగా, కేవం 27 సీట్లు మాత్రమే ఉన్నాయి. భారత దేశంలో ఉన్న 28 రాష్ట్రాలకు గాను ఏ ఒక్క రాష్ట్రానికి కూడా ముస్లిం ముఖ్యమంత్రి లేరు. పదిహేను రాష్ట్రాలలో ఒక్క ముస్లిం మంత్రి కూడా లేడు. ముస్లిం మంత్రులు ఉన్న రాష్ట్రాలో వారిని మైనారిటీ వ్యవహారాలకు పరిమితం చేశారు. ముస్లింలను ఉద్దేశ పూర్వకంగా మినహాయిస్తున్నారని అనుకుంటున్నారా? లేకపోతే ఏదో జరిగిపోతోందనుకుంటున్నారా?

సేన్ : ఇదొక ముందస్తు పథకం ప్రకారం చేస్తున్న విపత్తుగా నేను భావిస్తున్నాను. ఇదెక్కడి నుంచి మొదలు పెట్టాలో నాకు అర్థం కావడం లేదు. దేశంలో ముస్లింల జనాభా, వారి సంప్రదాయ పాత్ర నిష్పత్తి మధ్య ఉన్న తేడాను కనుగొనడానికి ప్రయత్నిస్తే, అది చాలా పలుచగా, గౌరవప్రదమైంది. దాని స్థానంలో వాళ్ళదొక అల్ప సంఖ్యాక సంప్రదాయం, అప్పుడప్పుడూ ఎక్కడా అధికారం ఉండదు, నిలుచోడానికి కూడా చోటు ఉండదు. దేశం దేనికోసం నిలబడిందనే గందరగోళాన్ని సూచిస్తుంది. దాన్నొక గందరగోళంగా చూడడం ముఖ్యమనుకుంటున్నాను.అధిక సంఖ్యాక పాలకులు మైనారిటీల గురించి పెద్దగా పట్టించుకోకపోవడానికి పరిమితం కాకుండా, అసలు జాతి అంటే ఏమిటో అర్థం చేసుకోలేకపోతున్నారు. వివిధ మతాలు, జాతుల ప్రజలు కలిసి పని చేయడం అనేది భారత నాగరికతకు చేసిన గొప్ప మేలు. ఇది చాలా తెలివిగా కించపరచడం, చాలా తెలివిగా దేశ చరిత్రను ధ్వంసం చేయడం. గతంలో, వర్తమానంలో దానికి వ్యతిరేకంగా నిలబడే అవకాశముంది.

కరణ్ : మీరు చెప్పిన విషయాన్ని మరొకసారి గుర్తు చేయదలుచుకున్నాను. ఎందుకంటే, మీరు చెప్పిన విషయం వల్ల ‘చాలా ముఖ్యమైన’ వారి మనసు బాగా గాయపడి ఉంటుంది. చాలా తెలివిగా కించపరడచం, దేశ చరిత్రను, వర్తమానాన్ని ధ్వంసం చేయడం. భారత ప్రభుత్వం ఒకానొక భయంకరమైనదని ‘లీ మోండీ’ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మీరెందుకు చెప్పారో నేను అర్థం చేసుకోగలను. నేనొకటి గుర్తు చేయదలుచుకున్నాను. బిజెపి, దాని మద్దతుదారులు, దానితో కలిసి ప్రయాణించేవారు మీ పట్ల చాలా కోపంగా ఉంటారనుకుంటా. ముగించే ముందు ఒక విషయం అడగదలుచుకున్నాను. “మోడీ నాయకత్వంలోని భారత ప్రభుత్వం ప్రపంచంలోనే ఒకానొక భయంకరమైనది” అని మీరు అన్నందుకు మిమ్మల్ని విమర్శిస్తారు. అలా దానిపైన నిలబడతారా?

సేన్ : అవును. నేనన్నదానిపైన తప్పకుండా నిలబడతాను. మోడీ ప్రభుత్వం చాలా భయంకరమైనది. నిజాయితీని, న్యాయాన్ని దారుణంగా నిర్లక్ష్యం చేసేలా తన సొంత ప్రజలతోనే ఆయన అలా వ్యవహరిస్తున్నారు. భారత దేశంలో ప్రజలను నిర్లక్ష్యం చేయడం పెద్ద విపత్తు. అదే దేశాన్ని పాలిస్తోంది. భారత దేశం గతంలో ఉన్నట్టు లేదిప్పుడు. తరువాతి కాలం మొదలైంది. గాంధీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ వంటి వారు జాతిని ఐక్యంగా ఉంచడానికి చాలా కష్టపడ్డారు. ఉన్నట్టుండి జాతి అనే ఒక ఆలోచన వచ్చింది. అధిక సంఖ్యాకులు ఉన్న భాగం మైనారిటీల జీవితాలను గజిబిజి చేయాలని ప్రయత్నిస్తోంది.

కరణ్ : అమర్తసేన్ గారు నా చివరి ప్రశ్న. ‘లీమోండీ’కి చెప్పినదానిపైన నిలబడతారని గమనించాను. మోడీ నాయకత్వంలోని భారత ప్రభుత్వం ప్రపంచంలోనే భయంకరమైనదని మీరు వివరించారు. మీరెందుకు చెప్పారంటే, ఈ ప్రభుత్వం తన ప్రజలతో చాలా దారుణంగా వ్యవహరిస్తోంది కనుక. ముగించడానికి ముందు ఒక అవగాహనకు సంబంధించినది. భారత ప్రభుత్వాన్ని ఇరాన్, అఫ్ఘానిస్తాన్, రష్యా దేశాలలో ఉన్న ప్రభుత్వాలతో ఎలా పోల్చుతారు? ఈ దేశాల్లో కూడా ప్రభుత్వాలు ప్రజతో దారుణంగా వ్యవహరిస్తున్నాయి కదా!

సేన్ : ఒక్కొక్కసారి దారుణమైన చర్యలను చూసినప్పుడు, అవి చాలా దారుణంగా ఉన్నప్పుడు, ‘మనం అంత దారుణంగా లేం’ అని భావిస్తాం. మన జాతుల గురించి అది చాలా దారుణమైన ఆలోచన. దానికి రెండు కారణాలున్నాయి. ఇతర దేశాల్లో దారుణమైన పరిస్థితులు చూసినప్పుడు, అవి మన దేశంలో కంటే దారుణంగా ఉంటే, అనేక రకాలుగా మనకు కొంత ఊరట కలుగుతుంది. ఒక వాస్తవం ఏమిటంటే, ప్రపంచంలోని వివిధ దేశాలు ఒక రకమైన న్యాయం కోసం పోరాడుతున్నాయి. అది ప్రతి దేశంలో ప్రతి చోట జరగాలి.

కరణ్ : మీరు చెప్పిన విషయాన్ని అర్థం చేసుకున్నాను. ఇరాన్, అఫ్ఘానిస్థాన్, వీలైతే రష్యా కూడా, అక్కడి ప్రభుత్వాలు భారత ప్రభుత్వం కంటే దారుణంగా ప్రజలతో వ్యవహరిస్తున్నాయి. అంటే భారత ప్రభుత్వం ప్రపంచంలో ఉన్న భయంకరమైన ప్రభుత్వాలలో ఒకటి కాదని అర్థం కాదు. ఆ విషయాన్ని నేను అర్థం చేసుకున్నాను. పాఠకులకు ఇది చాలా ముఖ్యం కనుక, నేను దాన్ని మళ్ళీ గుర్తు చేస్తున్నాను. నేను ఇక్కడితో ముగించదలుచుకున్నాను కానీ, మీరు చెప్పిన మతపరమైన ఆధిక సంఖ్యాకుల విధానాల ప్రభుత్వం గురించి చాలా పరిమితంగా చర్చించాం.

నిరసనపట్ల అసహనం, అలాగే పత్రికారంగం పట్ల వ్యవహరించే తీరు, ఎన్నికల కమిషన్ కానీ, పార్లమెంటు కానీ తమ కర్తవ్యాలను నిర్వర్తించడంలో పరిమితం చేయడం, సుప్రీంకోర్టుపైన ప్రస్తుతం కొనసాగుతున్న దాడి వంటి వాటిని భారత ప్రభుత్వం సమర్థిస్తోంది. ఈ విషయాలన్నిటినీ మనం చర్చించకపోవచ్చు. కానీ మీరుచెప్పిన విషయాలలోనే ఇవ్వన్నీ ఉన్నాయన్నది నిర్ధారించుకోగలను. మీరు చెప్పిన విషయాలను వివరించినందుకు కృతజ్ఞతలు. భారత ప్రభుత్వం ప్రపంచంలో అత్యంత భయంకరమైనదని ‘లీమొండి’ కిచ్చిన ఇంటర్వ్యూలో మీరు చెప్పిన విషయం పైన నిలబడతారని నేను భావిస్తున్నాను. ప్రొఫెసర్ అమర్త్యసేన్ గారు ఈ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు కృతజ్ఞతలు.

రాఘవశర్మ
9493226180

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News