హైదరాబాద్: 23 సంవత్సరాల యువతి తాను చనిపోయినట్లు అందరిని నమ్మించాలనుకుంది. అందుకు ఆ యువతి తన లాగే ఉండే మరో యువతి ని దారుణంగా హత్య చేసింది. ఈ ఘటన గతేడాది ఆగస్టు 16 న జర్మనీలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మ్యూనిచ్ లో నివసించే షహరాబాన్ అనే యువతి ఇన్ స్టాగ్రాంలో నకిలీ ప్రొఫైల్ ను తెరించింది. తన లాగా ఉండే యువతి కోసం వెతికింది. ఖదిద్దా అనే కస్మోటిక్ బ్లాగర్ అల్జీరియన్ యవతి ఆమె.షహరాబాద్ నివసించే ప్రాంతానికి 150 కిలోమీటర్ల దూరంలో ఖదిద్దా ఉంటుంది. ఈ క్రమంలో షహరాబాను , ఆమె ప్రియు ఇద్దరు కలిసి ఖద్దిదాను కలిశారు. కాస్మోటిక్ బిజినెస్ విషయంపై మాట్లాడేందుకు ఖదిద్దాను తీసుకుకెళ్తుండగా మార్గ మధ్యలో అటవి ప్రాంతంలో ఖదిద్దాను హత్యచేశారు.
బయటకు వెళ్లిన షహరాబాను ఇంటికి రాకపోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీస్టేషను లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు షహారాబాను కోసం వెతకగా డానుబే నదిన ఒడ్డున కారులో యువతి మృతదేహం ఉన్నట్లు స్థానికులు పోలీసులకు తెలిపారు. దీంతో పోలీసులు షహరాబాను తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. తల్లిదండ్రులు సంఘటన స్థలికి వెళ్లి చనిపోయింది తమ కూతురే అని గుర్తించారు. కానీ పోలీసులు ఘటన స్థలంలో కత్తులు ఉండటంతో హత్య చేసి ఉంటారని శవ పరీక్ష చేయించారు. డిఎన్ఏ పరీక్ష కూడా చేయించడంతో చనిపోయింది షహరాబాను కాదు అని తెలిసింది. దీంతో పోలీసులు విచారించగా షహారాబాను , ఆమె ప్రియుడు షకీర్ లను అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల విచారణలో షహరాబాను కుటుంబ కారణాల వల్ల తను చనిపోయినట్లు నమ్మించాలనుకొని ,తన లాగే ఉన్న యువతిని తన ప్రియుడు సహయంతో హత్య చేశానని ఒప్పుకుంది. దీంతో పోలీసులు ఆమెను, షకీర్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.