Saturday, December 21, 2024

7 లక్షల వరకు ట్యాక్స్ లేదు.. అదెలా అంటే..?

- Advertisement -
- Advertisement -

కొత్త పన్ను విధానంలో గతంలో రూ.5 లక్షల వరకు ఆదాయంపై రిబేట్ ఇచ్చేవారు. కానీ ఈ సారి బడ్జెట్‌లో ఆ రిబేట్ పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని రూ.7 లక్షలకు పెంచారు. రూ.7 లక్షల వరకు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అదే సమయంలో పాత పన్ను విధానంలో కూడా ఎలాంటి మార్పు చేయలేదు. అయితే చాలా మందికి బడ్జెట్ స్లాబ్‌లో మూడు లక్షల నుంచి ఆరు లక్షల వరకు ఆదాయం ఉంటే 5 శాతం పన్ను కట్టాలని ఉంది.

అలాంటప్పుడు 7 లక్షలకు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు అని చెప్పడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆ అనుమానాలు పటపంచలు చేయడానికే ఈ వివరణ. ఓ వ్యక్తి ఏడాదికి రూ.7 లక్షల ఆదాయం పొందుతున్నాడు అనుకుంటే.. తొలి 3 లక్షలకు ఎలాంటి పన్ను ఉండదు. తర్వాత 4 లక్షలకు పై శ్లాబుల ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కానీ, ఈ సారి ఆ మొత్తంపై రిబేట్ ను ప్రకటించారు. దీంతో రూ.7లక్షల వరకు ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. రిబేటు రూపంలో పన్ను మినహాయింపు వస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News