Saturday, January 4, 2025

కేరళ పాత్రికేయుడు కప్పన్ బెయిల్‌పై విడుదల

- Advertisement -
- Advertisement -

లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లో 2020లో హాథ్రస్ సామూహిక అత్యాచారానికి గురై మృతి చెందిన దళిత యువతి ఉదంతాన్ని కవర్ చేసేందుకు వెళుతూ అరెస్టయిన కేరళ పాత్రికేయుడు సిద్దీఖి కప్పన్ చివరికి కరాగారం నుంచి విడుదల అయ్యారు. బెయిల్ షరతుల కింద ఒక్కొక్కటి లక్ష రూపాయాల విలువైన రెండు పూచీకత్తులను ఆయన తరఫు న్యాయవాది బుధవారం కోర్టుకు సమర్పించారు. దాంతో లక్నో జిల్లా జైలు నుంచి కప్పన్ గురువారం విడుదలయ్యారు. దాదాపు 28 నెలల తర్వాత ఆయన జైలు నుంచి విడుదలయ్యారు.

2020 సెప్టెంబర్ 14న హాథ్రస్‌లో ఓ దళిత యువతిపై ఆమె గ్రామానికే చెందిన నలుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో గాయపడిన ఆమె ఢిల్లీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. బాధితురాలి మృతదేహాన్ని స్వగ్రామానికి తెచ్చిన పోలీసులు హడావుడిగా దహన సంస్కారాలు జరిపించడం వివాదాస్పదం అయింది. తమ ప్రమేయం లేకుండానే ఆమె అంత్యక్రియలు చేశారని, కడసారి చూపుకు కూడా నోచుకోనివ్వలేదని బాధితురాలి తల్లిదండ్రులు తెలిపారు. ఈ ఘటనపై పరిశోధనాత్మక కథానాన్ని కవర్ చేయడానికి వెళ్లిన సిద్దిఖీ కప్పన్‌ను మార్గమధ్యంలోనే అరెస్టు చేశారు. అతడికి నిషిద్ధ ఇస్లామిక్ సంస్థ ‘పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా’తో సంబంధాలున్నట్లు కేసు నమోదు చేశారు. గత సంవత్సరం సుప్రీంకోర్టు అతడికి బెయిల్ మంజూరు చేసినప్పటికీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడి) అతడిపై అక్రమ నగదు చలామణి కేసు పెట్టడంతో ఇన్నాళ్లు చెఱశాలలోనే గడిపాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News