Friday, November 22, 2024

తుపాన్ల రాకపై ముందస్తు అంచనా

- Advertisement -
- Advertisement -

బెర్లిన్ : భూ అయస్కాంత తుపాన్లను ముందుగానే తెలుసుకోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూ అయస్కాంత క్షేత్ర సమాచారాన్ని విశ్లేషించడానికి కొత్త పద్ధతిని అభివృద్ధి చేశారు. భూమి ద్రువాలలో ఒక ద్రువం నుంచి మరో ద్రువానికి భూ అయస్కాంత క్షేత్రం విస్తరిస్తుంది. సూర్య్డుడి నుంచి వెలువడే సౌరవాయువుల వల్ల అయస్కాంత క్షేత్రం బలంగా ప్రభావితమౌతుందని అధ్యయనం ద్వారా వెల్లడైంది. సౌరవాయువు అంటే సూర్యుని ఉపరితలం నుంచి నిత్యం వెలువడే విద్యుత్ అణువుల ప్రవాహం. అకస్మాత్తుగా అత్యంత ప్రకాశవంతమైన వెలుగులు విరజిమ్మితే వాటిని సౌరజ్వాలలు అంటారు.

ఇవి గాలిలో ఎక్కువగా రేణువులను విడిచిపెడతాయి. కొన్నిసార్లు ఈ సౌరజ్వాలలు సూర్యవలయం నుంచి వెలువడే వాటిని అనుసరించి అంతరిక్షం లోకి ప్లాస్మాను పంపిస్తాయి. నిరంతరం ఈ రేణువుల మార్పు చెందుతూ సూర్యుడి నుంచి భూమికి కొన్ని మిలియన్ల మైళ్ల దూరం ప్రయాణిస్తాయి. ఈ తుపాన్లు జిపిఎస్, శాటిలైట్ కమ్యూనికేషన్లతో సహా భూమిపై విద్యుత్ గ్రిడ్లను కూడా నాశనం చేస్తుంటాయి. సౌర చర్యలు బహుళ వ్యాప్తం. ఈ సౌర తుపాన్లను ముందుగా తెలుసుకోవడం కష్టం. అయితే జర్మనీ లోని పాట్స్‌డమ్ ఇనిస్టిట్యూట్ ఫర్ క్లైమేట్ ఇంపాక్ట్ రీసెర్చి పరిశోధకులు ఒక పద్ధతిని రూపొందించారు. సమతూకానికి దూరంగా ఉన్న సాంకేతిక వ్యవస్థలపై ఈ కొత్త పద్ధతి ఆధారపడింది. భూ అయస్కాంత క్షేత్రం ఈ వ్యవస్థకు సరిపోతుంది.

ఎందుకంటే సౌరవాయువు వల్ల ఈ క్షేత్రం సమాంతరానికి దూరంగా నెట్టివేయబడుతుంది. ఏవైతే సమాంతరానికి దూరంగా ఉంటాయో అవి తరచుగా అనేక మార్పులు చెందుతుంటాయి. నిశ్చలత్వం నుంచి తుపాన్‌గా మారుతుంటాయి. పరిశోధకులు తుపాను విధ్వంస సమయాన్ని (డిఎస్‌టి) పరిగణన లోకి తీసుకున్నారు. దీని ద్వారా భూ అయస్కాంత క్షేత్రానికి సమాంతర భాగం సరాసరి ఫలితాలు తెలిశాయి. సూర్యుడి నుంచి భారీ ఎత్తున అణుసముదాయం వెల్లువలా వెలువడినప్పుడే ఈ గతి తప్పడం జరుగుతుంది. భూమి నుంచి వెలువడే అయస్కాంత క్షేత్రం బలహీనమౌతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News