Monday, December 23, 2024

షార్ట్ సర్క్యూట్ తో పూరి గుడిసె దగ్ధం

- Advertisement -
- Advertisement -

కమాన్‌పూర్: మండలంలోని రొంపికుంట గ్రామానికి చెందిన మిరాల రాజుకు చెందిన నివాస గుడిసె గురువారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ప్రమాదానికి గురై పూర్తిగా ఖాళీ పోయింది. ఇంట్లో ఎవరు లేని సమయంలో మంటలు అంటుకొని, గ్యాస్ సిలిండర్ కూడా దానికి తోడు కావడంతో మరింత మంటలు పెరిగి ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితుడు వాపోయాడు. సమీపంలోని ప్రజలు మంటలు ఆర్పివేసే ప్రయత్నం చేశారు.

అలాగే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన వాహనం వచ్చి సదరు సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ప్రమాద సంఘటన స్థలానికి తహసిల్దార్ దత్తు ప్రసాద్ సందర్శించి నష్టం వివరాలు బాధిత కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబానికి వైస్‌ ఎంపీపీ ఉప్పరి శ్రీనివాస్ యాదవ్,మాజీ ఎంపీటీసీ కాటకం నారాయణలు రూ.5 వేల ఆర్థిక సహాయం అందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News