Saturday, December 21, 2024

ఆ స్పందనకు ఆనందంతో కన్నీళ్లు వచ్చాయి

- Advertisement -
- Advertisement -

టాలెంటెడ్ యాక్టర్ సుహాస్ హీరోగా టీనా శిల్పరాజ్ హీరోయిన్‌గా నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘రైటర్ పద్మభూషణ్’. నూతన దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఛాయ్ బిస్కెట్ ఫిల్మ్, లహరి ఫిలమ్స్ బ్యానర్స్‌పై అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్ నిర్మించారు.

ఈ సినిమా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ ఫ్యామిలీ స్క్రీనింగ్స్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ వేడుకలో సుహాస్ మాట్లాడుతూ “ప్రీమియర్స్‌కి అద్భుతమైన స్పందన వచ్చినందుకు చాలా ఆనందంగా వుంది. నా మొదటి థియేటర్ రిలీజ్ ఇది. సినిమా చూసిన చాలా మంది నన్ను ప్రశంసించడంతో అనందంతో నాకు మాట రాలేదు”అని అన్నారు.

దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ మాట్లాడుతూ.. “విజయవాడ, గుంటూరు, భీమవరం, కాకినాడ, వైజాగ్, హైదరాబాద్ ప్రీమియర్స్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. అందుకే ఈ ఈవెంట్‌కి ఫ్యామిలీ స్క్రీనింగ్స్ సక్సెస్ మీట్ అని నమ్మకంగా పేరు పెట్టాం. సినిమా చూసిన ప్రేక్షకుల స్పందన చూస్తుంటే ఆనందంతో కన్నీళ్లు కన్నీళ్లు వచ్చాయి”అని తెలిపారు. ఈ వేడుకలో టీనా శిల్పరాజ్, శరత్, గౌరీ, చంద్రు మనోహర్, కళ్యాణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News