Monday, December 23, 2024

వ్యవసాయానికి సక్రమంగా విద్యుత్‌ అందించాలంటూ సబ్ స్టేషన్ ముట్టడి

- Advertisement -
- Advertisement -

బోధన్: నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని ఖాజాపూర్, హున్నా, మందర్న రైతులకు వ్యవసాయానికి సక్రమంగా విద్యుత్‌ను సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం రైతులతో కలిసి విద్యుత్ సబ్ స్టేషన్‌ను ముట్టడించారు. అంతఃరాష్ట్ర రహదారిపై బైఠాయించారు. విద్యుత్‌ను సక్రమంగా అందించాలంటూ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు భారీ ఎత్తున రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు.

పోలీసులు అక్కడికి చేరుకొని ఆందోళనకారులను అరెస్టు చేసి ఠాణాకు తరలించారు. ఈసందర్భంగా హున్సా పిఎసిఎస్ చైర్మన్ మందర్న రవి మాట్లాడుతూ… ఖాజాపూర్, హున్సా, మందర్నా ప్రాంతాలలో సాగునీటి సదుపాయాలు లేవన్నారు. విద్యుత్ సదుపాయం వ్యవసాయానికి సక్రమంగా అందించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు. అటు వైపు ప్రాంతాలలో నిజాంసాగర్ కెనాల్ మరియు చెరువులు లేకపోవడంతో వ్యవసాయాలకు సాగునీరు అందక రైతులు పండించిన పంట ఎండుముఖం పడుతూ రైతులు నష్టాలు పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు వ్యవసాయానికి సక్రమంగా విద్యుత్‌ను అందించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News