Monday, January 20, 2025

నడి రోడ్డుపై భార్యను హత్య చేసిన భర్త

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః నడి రోడ్డుపై భార్యను భర్త హత్య చేసిన సంఘటన లంగర్‌హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…టోలిచౌకి, హకీంపేటకు చెందిన మహ్మద్ యూసుఫ్‌కు, కరీనా బేగం(26)కు ఏడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు సంతానం, యూసుఫ్ ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. దంపతుల మధ్య ఏడాదిన్నర క్రితం మనస్పర్ధలు రావడంతో కరీనా బేగం ఆశంనగర్‌లో ఉంటూ లంగర్‌హౌస్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది.

ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం పాఠశాలకు వస్తుండగా యూసుఫ్ ఐరన్‌ రాడ్‌ తో కరీనా బేగం పై దాడి చేయడంతో అక్కడే కుప్పకూలింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని కరీనా బేగంను ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి అప్పటికే ఆమె మృతి చెందినట్లు తెలిపారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News