- Advertisement -
జగిత్యాల టౌన్‌ః జాతీయ ఆరోగ్య మిషన్‌లో ఒప్పంద ప్రాతిపదికన మెడికల్ ఆఫీసర్ ఆయుర్వేద, మెడికల్ ఆఫీసర్ యునాని పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మెడికల్ ఆఫీసర్ ఆయుర్వేద పోస్టుకు బిఎఎంఎస్, మెడికల్ ఆఫీసర్ (యునాని) బియుఎంఎస్ పూర్తి చేసిన వారు అర్హులని తెలిపారు.
దరఖాస్తు ఫారం, నోటిఫికేషన్ వివరాలు https://jagtial.telangana.gov.in వెబ్‌సైట్‌లో పొందు పరిచినట్లు తెలిపారు. పూర్తి చేసిన దరఖాస్తు ఫారంతో పాటు అన్ని స్వయం ధృవీకృత నకలు కాపీలను జత పరచాలని సూచించారు. ఫిబ్రవరి 3 ఉదయం 10.30 గంటల నుంచి ఫిబ్రవరి 20 సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు ఫారాలను సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో గల జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు.
- Advertisement -