Saturday, November 23, 2024

ఎయిర్ ఇండియా విమానంలో మంటలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: నుంచి శుక్రవారం తెల్లవారుజామున భారత్‌కు వస్తున్న ఎయిర్ ఇండియా విమానానికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. కాలికట్‌కు చెందిన ఎయిర్ విమానం టేకాఫ్ అవుతుండగా మంటలు రావడంతో ఇంజిన్ ఫెయిలైంది. దీంతో పైలట్ తిరిగి వెనక్కి మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేయడంతో ప్రమాదం తప్పిందని తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఉన్న ఇంజిన్లలో ఒక ఇంజిన్‌లో మంట రావడాన్ని పైలట్లు గుర్తించి అప్రమత్తమయ్యారని సీనియర్ అధికారి తెలిపారు.

బోయింగ్ 737800 విమానంలో సంఘటన జరిగిన సమయంలో 184మంది ప్రయాణికులు ఉన్నారని అంతా క్షేమంగా ఉన్నారని ఇండియా అధికార ప్రతినిధి తెలిపారు. విటి ఎవైసి ఆపరేటింగ్ విమానం అబుదాబి నుంచి వస్తుండగా సాంకేతిక సమస్య తలెత్తి నెం1 ఇంజిన్‌లో మంటలు వచ్చాయి. టేకాఫ్ 1000అడుగులు ఎత్తులో ఉండగా ఈ ఘటన జరిగిందని డిజిసిఎ అధికారి తెలిపారు. ప్రమాదాన్ని పైలట్ ముందుగా గుర్తించడంతో సురక్షితంగా వెనక్కి మళ్లించి ల్యాండ్ చేశారని ప్రకటనలో డిజిసిఎ పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News