- Advertisement -
మామునూరు(సంగెం): బొల్లికుంట వాగ్దేవి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్ కందికొండ సాహితి కేంద్ర క్రీడల యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన జాతీయ యువజన ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన జాతీయ యువజన పార్లమెంటు ఉపన్యాస పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబర్చి రాష్ట్ర యువజన పార్లమెంటుకు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రకాష్ తెలిపారు.
రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనపరిస్తే ప్రధానమంత్రి సమక్షంలో మాట్లాడే అవకాశం ఉంటుందన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రస్థాయి యువజన పార్లమెంటుకు ఎంపికైన సాహితిని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రకాశ్, డీన్ ఆఫ్ అడ్మినిస్టేషన్ డాక్టర్ శశిధర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ కుమార్, ఎన్‌ఎస్‌ఎస్ అధికారి డాక్టర్ మహ్మద్ ఆజమ్ పలువురు పాల్గొన్నారు.
- Advertisement -