హైదరాబాద్ : సంక్షేమం- అభివృ ద్ధి జోడు గుర్రాలుగా రాష్ట్రం ప్రగతి పథంలో పయనిస్తుందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొ న్నారు. రాష్ట్ర ప్రభుత్వం సాధిస్తున్న సమ్మిళిత సమగ్రాభివృద్ధి యావత్ దేశానికి ఆదర్శప్రాయంగా నిలుస్తుందన్నారు. ప్రతి రంగంలోనూ దేశం ఆశ్చర్యపోయే విధంగా అద్భుతమైన ప్రగతిని ఆవిష్కరిస్తూ పురోగమిస్తుందని ఆమె పేర్కొన్నారు. తెలంగాణ అసెంబ్లీ వార్షిక బడ్జెట్ (202324) సమావేశాలు శుక్రవారం మధ్యాహ్నం 12:10 గంటలకు ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఉభయసభలను ఉద్ధేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగించారు.
ముందుగా కాళోజీ మాటలతో గవర్నర్ ప్రసంగం ప్రారంభించి దాశరథి కవితతో ప్రసంగాన్ని ముగించారు. ‘పుట్టుక నీది.. చావు నీది.. బతుకంతా దేశానిదని’ కాళోజీ మాటలను గుర్తు చేస్తూ తమిళిసై తన ప్రసంగాన్ని షురూ చేశా రు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ తెలంగాణ దేశాకే ఆదర్శంగా మారిందని, ప్రజల ఆశీర్వాదాలు, సిఎం నైపుణ్య పాలనతో రాష్ట్రాభివృద్ధి సాధించిందని, ప్రజాప్రతినిధుల కృషి, ఉద్యోగుల నిబద్ధత, రాష్ట్ర ప్రగతికి కారణమయ్యాయని పేర్కొన్నారు. ఒకప్పుడు కరెంటు కోతలతో అంధకారం లో కొట్టుమిట్టాడిన తెలంగాణ, ప్రభుత్వ అవిరళ కృషితో నేడు 24 గంటల విద్యుత్ సరఫరాతో వెలు గు జిలుగుల రాష్ట్రంగా విరాజిల్లుతుందన్నారు.
నేడు తెలంగాణ గ్రామాల రూపురేఖలు..
వ్యవసాయం కుదేలై విలవిలలాడిన నేల నేడు దేశానికే అన్నం పెట్టే ధాన్యాగారంగా అవతరించిందని గవర్నర్ పేర్కొన్నారు. తాగునీటి కోసం తల్లడిల్లిన పరిస్థితుల నుంచి పూర్తిగా బయటపడి, 100 శాతం గ్రామాల్లో ఇంటింటికీ ఉచితంగా స్వచ్ఛమైన, సురక్షితమైన జలాలను సరఫరా చేస్తుందని ఆమె వెల్లడించారు. ఒకనాడు పాడుబడిన తెలంగాణ గ్రామాల