Monday, December 23, 2024

స్పిన్‌పై గురి.. నెట్స్‌లో శ్రమిస్తోన్న టీమిండియా స్పిన్నర్లు

- Advertisement -
- Advertisement -

స్పిన్‌పై గురి
స్పిన్నర్లుతో నెట్స్‌లో శ్రమిస్తోన్న టీమిండియా!
జట్టులో చేరిన వాషింగ్టన్ సుందర్
నెట్ బౌలర్లుగా కుమార్, రాహుల్ చాహర్, సాయికిషోర్
ఇప్పటికే జట్టులో అశ్విన్, అక్షర్, కుల్దీప్, రవీంద్ర జడేజా
నాగ్‌పూర్: ఆస్ట్రేలియాతో తొలి టెస్టు నేపథ్యంలో టీమిండియా స్పిన్ బౌలింగ్‌పై ప్రధానంగా దృష్టి సారించింది. సెలెక్టర్లు నెట్స్‌లో బౌలింగ్ చేసేందుకు నలుగురు బౌలర్లను కేటాయించారు. అయితే నలుగురు బౌలర్లూ స్పిన్నర్లే కావడం విశేషం. అధికారుల సమాచారం ప్రకారం ఉత్తరప్రదేశ్‌కు చెందినలెఫార్మ్ స్పిన్నర్ కుమార్ రాజస్థాన్‌కు చెందిన లెగ్‌స్పిన్నర్ రాహుల్ చాహర్ (23), ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ దేశవాళీ క్రికెట్లో తమిళనాడు తరఫున ఆడే ఆర్ సాయి కిషోర్ (26) జట్టులో చేరారు.

మరోవైపు ఆసీస్‌తో తొలి టెస్టు జరగనున్న నాగ్‌పూర్‌లో ఉన్న జట్టుతో వాషింగ్టన్ సుందర్ కలిశాడు. వైట్‌బాల్ భారతజట్టుకు ఎక్కువగా ప్రాతినిధ్యం వహిస్తున్న సుందర్ చివరిసారి టెస్టు మ్యాచ్ ఇంగ్లాండ్‌పై మార్చి ఆడాడు. అంతకుముందు ఆస్ట్రేలియాపైనే 23ఏళ్ల సుందర్ అరంగేట్రం చేశాడు. కాగా టెస్టు జట్టులో ఇప్పటికే స్పిన్నర్లు ఆర్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా ఉన్నారు.

అయినా సెలెక్టర్లు నెట్స్‌లో ప్రాక్టీస్ చేసేందుకు అదనంగా పేసర్లు అవసరం లేదని భావించి నెట్ బౌలర్లుగా ఎంపిక చేశారు. కంగారూలతో తొలి టెస్టు నెల నాగ్‌పూర్ వేదికగా ప్రారంభం కానుంది. గురువారమే జట్టు నాగ్‌పూర్‌కు చేరుకుంది. రోహిత్ శర్మ సారథ్యం వహించనుండగాశ్రేయస్ అయ్యర్ ఇంకా జట్టులో చేరలేదు. విదర్బ క్రికెట్ అసోసియేషన్ (విసిఎ)కు చెందిన రెండు గ్రౌండ్సుల్లో టీమిండియా ప్రాక్టీస్ చేస్తోంది.

తొలి రెండు టెస్టులకు భారతజట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, భరత్ (వికెట్‌కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్‌కీపర్), ఆర్ అశ్విన్, అక్షర్‌పటేల్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, ఉమేశ్ యాదవ్, ఉనద్కత్, సూర్య.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News