Monday, December 23, 2024

ఏకమవుతున్న విపక్షం..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: అధికార ఎన్‌డియే ప్రభుత్వంపై వ్యూహాత్మక దాడి చేసేందుకు శుక్రవారం సుమారు 16 ప్రతిపక్ష పార్టీలు భేటీ అయ్యాయి. అదానీ స్టాక్ కలకలంపై పార్లమెంటులో వెంటనే చర్చించాలని విపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. గురువారం విపక్షాలు మూకుమ్మడిగా ఉభయ సభల్లో కేంద్రానికి వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమం నిర్వహించిన స్తంభింపచేశాయి. మరుసటి రోజు విపక్షాలు సంయుక్త సమావేశాన్ని నిర్వహించాయి. పార్లమెంటరీ కమిటీతో జరిపించాలని లేదా సుప్రీంకోర్టు ఆధ్వర్యంలోని కమిటీతో దర్యాప్తు జరిపించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ సందర్భంగా విపక్ష నేతల మాట్లాడుతూ అదానీ సమస్యను సభలో చర్చించాలని కోరుతున్నామన్నారు.

చర్చకు అనుమతించకపోతే సభలోనే ఆందోళన నిర్వహిస్తామని పేర్కొన్నారు. రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే చాంబర్‌లో 16మంది పార్టీల నేతలు భేటీ అయ్యారు. కాంగ్రెస్‌తోపాటు ఎస్‌పి, బిఆర్‌ఎస్, శివసేన, సిపిఐ, ఐయుఎంఎల్, కేరళ కాంగ్రెస్ మాని), కేసి (థామస్), ఆర్‌ఎస్‌పి నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎల్‌ఐసి, ఎస్‌బిఐలను రక్షించేందుకు స్వతంత్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. అదానీ గ్రూప్‌లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా మోడీ ఒత్తిడితో ఆ సంస్థలు పెట్టుబడులు పెట్టాయని ఆరోపించారు. ప్రభుత్వ రంగానికి చెందిన ఎల్‌ఐసి, ఎస్‌బిఐ సంస్థలు అదానీ గ్రూప్‌లో పెట్టుబడులు పెటి నష్టపోయినా ఇంతవరుకు స్పందించలేదని జైరాం రమేశ్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News