- Advertisement -
ఇంఫాల్: మణిపూర్‌లో భూకంపం సంభవించింది. శనివారం ఉదయం 6.14 గంటలకు ఉఖ్రుల్లో భూ ప్రకంపనలు సంభవించడంతో భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూ ప్రకంపనలతో రిక్టర్ స్కేలుపై 4.0తీవ్రత నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ప్రకటించింది.
ఉఖ్రుల్‌కు 94 కిలోమీటర్ల దూరంలో భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఏర్పడినట్లు తెలిపింది. భూకంపంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు పేర్కొన్నారు.
- Advertisement -