- Advertisement -
మహిళా ఉద్యోగినిపై ఓ అధికారి వేధింపులకు పాల్పడిన ఘటన జిహెచ్ఎంసిలో చోటుచేసుకుంది. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఆర్ మోహన్ సింగ్ తనను వేధిస్తున్నాడని ఆరోపిస్తూ బాధిత మహిళా ఉద్యోగిని జిహెచ్ఎంసి కమిషనర్ కు ఫిర్యాదు చేసింది. దీంతో బాధితురాలు చేసి ఆరోపణలపై విచారణకు కమిషనర్ ఆదేశించారు.
విచారణలో మహిళా ఉద్యోగినిని వేధించినట్లు తేలడంతో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పై చర్యలు తీసుకున్నారు. సదరు అధికారిని బదిలీ చేయాలని పబ్లిక్ హెల్త్ అండ్ మున్సిపల్ శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ కు కమిషనర్ లేఖ రాశారు.
- Advertisement -