- Advertisement -
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో మధ్యాహ్న భోజన వంట పని వారికి రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురును అందించింది. వారికి ప్రతి నెలా అందిస్తున్న గౌరవ వేతనాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. వంట మనిషి, సహాయకులకు ఇప్పటి వరకు రూ.వెయ్యి ఇస్తున్న గౌరవ వేతతాన్ని రూ.3 వేలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
గతంలో వీరికి ఇచ్చే వెయ్యి రూపాయాల్లో రూ. 600 కేంద్రం ఇస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం రూ. 400 చెల్లిస్తుంది. ఈ సారి కేంద్రం తన వాటాను పెంచకున్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తన వాటా కింద రూ. 2,400 అందజేస్తూ కేంద్రం ఇచ్చే నిధులతో కలుపుకుని మొత్తం రూ. 3000 అందజేయనున్నట్లు విద్యాశాఖ సెక్రటరీ కరుణ వాకాటి వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 54,201 మంది మధ్యాహ్న భోజనం కింద వంట మనిషి, సహయకులకు పెంచిన వేతనం త్వరలో అందనుంది.
- Advertisement -