Monday, January 20, 2025

మరాఠ్వాడలో మలి కేక

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్/నిర్మల్ ప్రతినిధి/ భైంసా : నాందేడ్ సభకు సర్వం సిద్ధమైంది. టిఆర్‌ఎస్ బిఆర్‌ఎస్‌గా రూపాంతరం చెందిన తర్వాత జాతీయస్థాయిలో జరుగుతున్న తొలి సభ కావడంతో పార్టీ శ్రేణులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సభకు నాందేడ్ సర్వసిద్ధమైంది. సభ జరిగే గురుగోవింద్ సింగ్ మైదానం, పరిసర ప్రాంతాలను ఇప్పటికే గులాబీమయంగా తీర్చిదిద్దారు. సభస్థలి వేదికను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. భారీగా జనసమీరణ చేస్తున్నా రు. సిఎం కెసిఆర్‌తో పాటు అనేక మంది జాతీయ నాయకులు ఈ సభకు హాజరవుతున్నారు. అందువల్ల సభకు చేరుకునే ప్రాంతాల్లో పెద్దఎత్తున కెసిఆర్ కటౌట్లను నెలకొల్పారు. ఆయా ప్రాంతాల్లో పార్టీ ఫ్లెక్సీలు, జెండాలతో నింపివేశారు. దీంతో స భాస్థలికి నలుదిక్కులా కిలోమీటర్ల మేర ఆ ప్రాంతమంతా గులాబీమయం గా మారింది. రోడ్డుకు ఇరువైపులా ఏర్పాటు చేసిన భారీ హోర్డింగులు, బెలూన్లు, స్టిక్కర్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

సభను విజయవంతం చేసేందుకుగానూ రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దే వాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ బిబి పటేల్, ప్ర భుత్వ విప్ బాల్క సుమన్, శాసనసభ్యులు జోగు రామన్న, షకీల్, హనుమంత్‌షిండే, టిఎస్‌ఐఐసి చై ర్మన్ గ్యాదరి బాలమల్లు, సివిల్ సప్లైస్ కార్పోరేషన్ చైర్మన్ రవీందర్ సింగ్ తదితర నేతలు గత కొన్ని రోజులుగా నాందేడ్‌లోనే ఉండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇతర పార్టీ నేతలతో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సమన్వయం చేసుకుంటూ అన్నీ తానై సభ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఒకవైపు సభ ఏర్పాట్లను చూస్తూ నే… మరోవైపు విస్తృతంగా గ్రామాల్లో పర్యటిస్తూ సర్పంచ్‌లు ఇతర స్థానిక ప్రజాప్రతినిధులను, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను కలుస్తూ సభ విజయవంతానికి అహర్నిశలు శ్రమిస్తున్నారు. మరఠా వీధుల్లో కలియ తిరుగుతూ వృద్దులు, మహిళలు, రైతులు, యువకులను పలకరిస్తూ తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ నేతృత్వంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను బిఆర్‌ఎస్ నేతలు వివరిస్తున్నారు.

దీంతో నాందేడ్ జిల్లాలోని నాందేడ్ సౌత్, నార్త్ బోకర్, నా యిగాం, ముఖేడ్ డెగ్లూర్‌లోహ నియోజకవర్గాలు కిన్వట్, ధర్మాబాద్ ఉమ్రి హిమాయత్ నగర్ తదితర ప్రాంతాల నుంచి అన్ని గ్రామాల నుండి పెద్దఎత్తున ప్రజలు స్వచ్చంద తరలి వచ్చే అవకాశం ఉందని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈ దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించి సభకు భారీగా జనసమీకరణ చేసే పనిలోన నిమగ్నమయ్యారు. అలాగే నాందేడ్ జిల్లా సరిహద్దు తెలంగాణ నియోజకవర్గలైన ఆదిలాబాద్, బోథ్, ముధోల్, బోధన్, జుక్కల్ తో పాటు నిర్మల్, నిజామాబాద్ నియోజకవర్గాల నుంచి కూడా భారీగా ప్రజలు సభకు తరలివచ్చే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెప్పుతున్నాయి.

సభ ప్రాంగణాన్ని పరిశీలించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కేంద్రంలో ఆదివారం సిఎం కెసిఆర్ సభ జరుగుతున్న నేపథ్యంలో అన్ని ఏర్పాటు పూర్తి చేసినట్లు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. సభకు హాజరవుతున్న ప్రజానీకం ఎలాంటి ఇబ్బందులు పడకుండా తగిన ఏర్పాట్లు చేశామన్నారు. పార్టీ నేతలు బాల్క సుమన్, బిబి పాటిల్, హన్మంత్‌షిండే, షకీల్ రవీందర్ సింగ్, షకీల్, బాలమల్లుతో కలిసి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సభ ప్రాంగణాన్ని సందర్శించి, ఏర్పాట్లను పర్యవేక్షించారు. కాలినడకన మైదానమంతా కలియతిరిగారు. సభా వేదిక అలంకరణ అతిధులు, ముఖ్య నేతల సీటింగ్‌పై నేతలకు దిశా నిర్దేశం చేశారు.

భారీగా చేరికలకు నేతల సన్నాహాలు

దేశ వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేసే దిశగా బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ పావులు కదులుపుతున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల నుంచి నేతలు బిఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. మహారాష్ట్ర నుంచి కూడా అనేకమంది ప్రజా ప్రతినిధులు ఇటీవల కెసిఆర్‌ను కలిశారు. ఇదే క్రమంలో నాందేడ్ బహిరంగ సభలో పెద్ద ఎత్తున చేరికలు జరిగేలా నేతలు గ్రామాల వారీగా తిరుగుతున్నారు. ఒకవైపు చేరికలపై సన్నాహాలు జరుగుతున్నాయి. మరోవైపు సభకు జనాన్ని తరిలించేందుకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, గ్రామాల్లో ఎక్కువ మొత్తంలో చేరికలు జరుగుతున్నాయని చెబుతున్నారు ఆ పార్టీ నేతలు. ఈ సభలో కెసిఆర్ కీలకమైన ప్రసంగం చేయనున్నారని తెలుస్తోంది. రాబోయే ఎన్నికల దష్ట్యా తొలిసారి పొరుగు రాష్ట్రాల్లో బిఆర్‌ఎస్ సభను జరుపుతుండటంతో ఇతర రాష్ట్రాల రాజకీయ పార్టీల దృష్టి నాందేడ్ సభపై పడింది.

జన సమీకరణపై నేతల గురి

నాందేడ్ లో జరిగే సభకు భారీగా జన సమీకరణ చేసేందుకు నేతలు కసరత్తు చేస్తున్నారు. మహారాష్ట్రకు సరిహద్దులో ఉండే నిజామాబాద్, ఆదిలాబాద్, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఉండే మహారాష్ట్ర బార్డర్ గ్రామాల నుంచి భారీగా జన సమీకరణ చేసేందుకు ఆయా జిల్లాల నాయకులు కసరత్తు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా సరిహద్దులో ఉండే గ్రామాల నుంచి మంత్రి ప్రశాంత్ రెడ్డి నేతృత్వంగా భారీగా జనాలను సమీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి బార్డర్ లో ఉండే మహారాష్ట్ర కు చెందిన గ్రామాల ప్రజలు ఇప్పటికే బిఆర్‌ఎస్ పార్టీలో చేరేందుకు గతంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన నేతలు ఎంఎల్‌సి కవితను, ఎంఎల్‌ఎ షఖీల్ కలిసి తమ గ్రామాలను తెలంగాణలో విలీనం చేసుకోవాలని కోరిన సందర్ఫాలు ఉన్నాయి. ఇక ఇప్పుడు బిఆర్‌ఎస్ జాతీయ పార్టీగా ఆవిర్భవించటంతో తెలంగాణకు సరిహద్దులో ఉన్న మహారాష్ట్రకు చెందిన గ్రామాల ప్రజలు బిఆర్‌ఎస్ వైపు ఆకర్షితులవుతున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు.

చేరికలు కూడా భారీ స్థాయిలో ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే యవాత్మల్ హింగోలి ఎంపీ హేమంత్ పాటిల్ తో మల్కాజ్‌గిరి నియోజకవర్గం ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు చర్చలు జరిపారు. అలాగే రెండు రోజుల కిందట రాష్ట్ర మహిళ అభివృద్ధి సంస్థ చైర్మన్ ఆకుల లలిత ఆధ్వర్యంలో నాందేడ్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, ఉద్యోగసంఘాల నేతలు కెసిఆర్‌ను కలిసి మద్దతు తెలిపారు.అలాగే ప్రస్తుత నాందేడ్ జెడ్‌పి చైర్మన్ మహారాష్ట్ర రాష్ట్ర మున్నూరుకాపు సంఘం అధ్యక్షులు సురేష్ అంబులగేకర్, నాందేడ్ జిల్లాలోని వివిధ మున్సిపల్ కార్పొరేషన్ ఛైర్మెన్లు, మహారాష్ట్ర జిల్లా పరిషత్ ఎంప్లాయ్ యూనియన్ జిల్లా ప్రెసిడెంట్ బాబురావు పజర్వాడ్, నాందేడ్ టీచర్ యూనియన్ ప్రెసిడెంట్ వెంకట్ గంధపవడ్, ధర్మభాధ్ మాజీ మేయర్ దిగంబర్ లక్మావార్ లు కేసీఆర్ తో చర్చలు జరిపారు. నాందేడ్ జిల్లా సరిహద్దులోని యవత్మల్, మహెూర్, కిన్వాట్, నర్సి, దేగ్లూర్, పర్బని తదితర ప్రాంతాల నుంచి భారీ ఎత్తున మరాఠాలను సభకు తరలించేందుకు ఇప్పటికే కసరత్తు పూర్తి చేశారు.

కెసిఆర్ పర్యటన వివరాలు

హైదరాబాద్ నుంచి సిఎం కెసిఆర్ బయలుదేరి మధ్యాహ్నం 12.30గంటలకు నాందేడ్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక కాన్వాయ్‌లో బయలుదేరి సభా వేదిక సమీపంలోని చత్రపతి శివాజీ విగ్రహం వద్దకు చేరుకుంటారు. పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి చారిత్రక గురుద్వారాను సందర్శిస్తారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. అక్కడి నుంచి బహిరంగ సభ జరిగే ప్రాంతానికి ఒంటిగంట ముప్పైనిమిషాలకు చేరుకోనున్నారు. ఆయన సమక్షంలో మహారాష్ట్రకు చెందిన పలువురు సీనియర్ నేతలు బిఆర్‌ఎస్‌లో చేరనున్నారు. అనంతరం బిఆర్‌ఎస్ నాందేడ్ నేతలను ఉద్దేశించి కెసిఆర్ ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం 2.30గంటలకు సభా స్థలి నుంచి స్థానిక సిటీ ప్రైడ్ హోటల్‌కు చేరుకుంటారు. భోజనానంతరం 4 గంటలకు జాతీయ, స్థానిక మీడియా ప్రతినిధులతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం కానున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News