Monday, December 23, 2024

అశోక్ గల్లా2 గ్రాండ్ గా ప్రారంభం

- Advertisement -
- Advertisement -

‘హీరో’ చిత్రంతో సినీ అరంగేట్రం చేసిన సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు, సూపర్ స్టార్ కృష్ణ మనవడు యంగ్ హీరో అశోక్ గల్లా తన రెండవ ప్రాజెక్ట్- # అశోక్ గల్లా2 తో రాబోతున్నారు. అ!, జాంబీ రెడ్డి వంటి బ్లాక్‌బస్టర్‌లను అందించి ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ హను-మాన్ కోసం పని చేస్తున్న క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి కథ అందించారు. గుణ 369 ఫేమ్ అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహిస్తున్నారు. లలితాంబిక ప్రొడక్షన్స్ ప్రొడక్షన్ నెం 1గా ఎన్నారై (ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్) సోమినేని బాలకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. కె సాగర్ సహ నిర్మాత కాగా నల్లపనేని యామిని సమర్పిస్తున్నారు.

తన తొలి చిత్రం ‘హీరో’తో ఆకట్టుకున్న అశోక్ గల్లా తన తదుపరి స్క్రిప్ట్‌ని ఎంచుకోవడానికి కొంత సమయం తీసుకున్నారు. ఈ సినిమా కంప్లీట్ మేకోవర్ కాబోతున్నారు. కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ‘గుణ 369’ దర్శకుడిగా అర్జున్ జంధ్యాల ప్రశంసలు అందుకున్నారు. అవుట్ ఆఫ్ ది బాక్స్ ఐడియాలకు పేరుపొందిన ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి యూనిక్ స్టొరీని రాశారు. మరి ఈసారి ఎలాంటి కొత్త జానర్‌తో అలరించబోతున్నారో వేచి చూడాలి.

ఈరోజు ఈ సినిమా గ్రాండ్ గా లాంచ్ అయింది. ముహూర్తం షాట్‌కు వెంకటేష్ క్లాప్‌ కొట్టగా, నమ్రత శిరోద్కర్ కెమెరా స్విచాన్ చేయగా, బోయపాటి శ్రీను గౌరవ దర్శకత్వం వహించారు. స్క్రిప్ట్‌ని మిర్యాల రవీందర్ రెడ్డి, సాహు గారపాటి, హరీష్ పెద్ది.. మేకర్స్, ప్రశాంత్ వర్మకు అందజేశారు. ఆది శేషగిరిరావు, బివిఎస్‌ రవి, గల్లా జయదేవ్‌ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. టాప్ టెక్నీషియన్స్ ఈ సినిమాకు పని చేస్తారు. ప్రముఖ రచయిత బుర్రా సాయిమాధవ్ డైలాగ్స్ అందిస్తున్నారు. ఇటీవల వచ్చిన ధమాకా చిత్రానికి బ్లాక్ బస్టర్ మ్యూజిక్ అందించిన పాపులర్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా, ప్రముఖ సినిమాటోగ్రఫర్ ప్రసాద్ మూరెళ్ల కెమరామెన్ గా, తమ్మిరాజు ఎడిటర్ గా పని చేస్తున్నారు.

మూవీ లాంచ్ ఈవెంట్ అశోక్ గల్లా మాట్లాడుతూ.. ప్రశాంత్ వర్మ షో రన్నర్ గా వుండటం నాకు, దర్శకుడు అర్జున్, మా టీం అందరికీ చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. సాయి మాధవ్ గారు ఈ సినిమాకి మాటలు రాయడం ఆనందంగా వుంది. నేను సాఫ్ట్ గా ఉంటానని అంటారు. ఈ సినిమాతో నన్ను అందరూ రఫ్ లుక్ లో కూడా యాక్సప్ట్ చేస్తారని నమ్ముతున్నాను. మీ అందరి కోసం ఒక మంచి సినిమా తెస్తాం. లాంచ్ ఈవెంట్ కి విచ్చేసి మాకు బెస్ట్ విశేష్ అందించిన వెంకటేష్ గారికి, బోయపాటి గారికి, నమ్రత అక్కకి, అందరికీ కృతజ్ఞతలు’’ తెలిపారు.

అర్జున్ జంధ్యాల మాట్లాడుతూ.. చాలా కొత్త కథ. ప్రశాంత్ వర్మ గారు చాలా మంచి ఎంటర్ టైనింగ్ స్క్రిప్ట్ అందించారు. సినిమా నెక్స్ట్ లెవల్ లో వుంటుంది. అందరూ ఎంజాయ్ చేస్తారు. ఇందులో అశోక్ గల్లా గారు నెక్స్ట్ లెవల్ లో వుంటారు. ఈ కథకు సాయి మాధవ్ బుర్రా గారు మాటలు రాయడం ఆనందంగా వుంది. మంచి కథ. అంతే చక్కని చిత్రీకరణతో ప్రేక్షకుల ముందుకు వస్తాం. భీమ్స్ బెస్ట్ మ్యూజిక్ అందిస్తున్నారు. ప్రసాద్ మురెళ్ళ, తమ్మిరాజు గారు.. అందరం నెక్స్ట్ సినిమా చేయడానికి పని చేస్తున్నాం. నిర్మాత బాలకృష్ణ గారు నాకు ఎప్పటి నుంచో నాకు స్నేహితులు. సినిమా పట్ల చాలా ప్యాషన్ ఉన్న నిర్మాత. ఆయన మొదటి సినిమాకి నేనే దర్శకుడు కావడం, ప్రశాంత్ వర్మ గారు కథ ఇవ్వడం.. ఇవన్నీ అద్భుతంగా కుదిరాయి’’ అన్నారు.

ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. ఈ కథని చాలా ఇష్టపడి రాసుకున్నాను. దాదాపు నాలుగేళ్ళుగా ఈ కథపై పని చేశాను. ఈ కథపై అశోక్ పేరు రాసుంది. ఇందులో సరికొత్త అశోక్ ని ప్రేక్షకులు చూస్తారు. తన మొదటి చిత్రానికి దీనికి చాలా వైవిధ్యం వుంటుంది. చాలా ఫ్రెష్ గా వుంటుంది. ఈ పాత్ర కోసం కంప్లీట్ మేకోవర్ చేయబోతున్నారు. నేను రాసిన కథల్లో ఇది చాలా ఎంటర్ టైనింగ్ ఫిల్మ్. చాలా కొత్త జోనర్ కథ. అర్జున్ గారు ఈ కథని అద్భుతంగా హ్యాండిల్ చేస్తారని నాకు అనిపించింది. సాయి మాధవ్ బుర్రాకి ఈ కథకు మాటలు రాయడం ఆనందంగా వుంది. భీమ్స్ , ప్రసాద్ మూరెళ్ల, తమ్మిరాజు అద్భుతమైన టీం కలసి చేస్తున్నారు. అర్జున్ జంధ్యాల ఈ చిత్రాన్ని అందరికీ మెమరబుల్ చిత్రంగా మలుస్తారని గర్వంగా నమ్మకంగా వుంది. తర్వలోనే షూటింగ్ స్టార్ట్ చేస్తారు’’ అని తెలిపారు

బుర్రా సాయిమాధవ్ మాట్లాడుతూ.. ప్రశాంత్ వర్మ గారితో పని చేయాలని ఎప్పటి నుంచో వుండేది. ఇప్పుడు ఆయన కథకి మాటలు రాసే అవకాశం రావడం ఆనందంగా వుంది. అర్జున్ జంధ్యాల చాలా క్లారిటీ విజన్ వున్న దర్శకుడు. హీరో సినిమా చూసినప్పుడే అశోక్ తో ఎలాంటి పాత్రకైన సరిపోతాడని అనిపించింది. చాలా మంచి ఎనర్జీ లెవల్స్, బాగా చేయాలనే తపన అశోక్ లో వున్నాయి. చాలా మంచి కథ ఇది. అన్ని విధాలుగా ఈ సినిమా సంచలనాలు సృష్టించాలని కోరుకుంటూ నా వంతు చేయాల్సిన పని వందకి వంద శాతం చేస్తాను’’ అని చెప్పారు.

హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియజేస్తారు

తారాగణం: అశోక్ గల్లా
సాంకేతిక విభాగం
కథ: ప్రశాంత్ వర్మ
దర్శకత్వం: అర్జున్ జంధ్యాల
నిర్మాత: సోమినేని బాలకృష్ణ
బ్యానర్: లలితాంబిక ప్రొడక్షన్స్
సమర్పణ: నల్లపనేని యామిని
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
డీవోపీ: ప్రసాద్ మూరెళ్ల
ఎడిటర్: తమ్మిరాజు
డైలాగ్స్: బుర్రా సాయి మాధవ్
పబ్లిసిటీ డిజైనర్: ధని ఏలే
పీఆర్వో: వంశీ-శేఖర్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News