Saturday, November 23, 2024

ఆర్‌ఎఫ్‌సిఎల్ ఉద్యోగాల పేరిట మోసం

- Advertisement -
- Advertisement -

జ్యోతినగర్: ఆర్‌ఎఫ్‌సిఎల్ కర్మాగారంలో ఉద్యోగాలు ఇస్తామని 9 మంది బాధితుల వద్ద 15లక్షల 20వేల రూపాయలు వసూలు చేసిన ముగ్గురిపై బాధితులు ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎన్టీపీసీ క్రిష్ణానగర్‌కు చెందిన సురవేణి మధుసూదన్ రావు, అతని భార్య, మరో వ్యక్తి జక్కుల శ్రీనివాస్ ద్వారా 9 మంది బాధితుల వద్ద విడతల వారిగా 15లక్షల 20వేల రూపాయలు వసూలు చేసి ఉద్యోగాలు కల్పించకుండా మోసం చేశారని బాధితులు మద్దెల మల్లయ్య, జక్కుల కొమురయ్య, గోవిందుల గోపాల్, తాత సంతోష్, అలీ, రమేష్, శ్రీనివాస్, క్రిష్ణ, శ్రీకాంత్ వద్ద 15లక్షల 20వేల రూపాయలు వసూలు చేశారు.

ఇప్పటికీ డబ్బులు ఇచ్చేది లేదు ఏం చేసుకుంటారో మీ ఇష్టం అని జవాబు ఇవ్వడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. రామగుండం ఎరువులు కర్మాగారంలో ఉద్యోగాల కల్పన కోసం కొత్తగా ఎన్టీపీసీ క్రిష్ణానగర్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఓ కన్సల్టెంట్ పేరుతో చాలా మంది వద్ద డబులు వసూలు చేసినట్లు బాధితులు ఆవేదన చెందుతున్నారు. డబ్బులు చెల్లించామని సంవత్సరాలు గడుస్తున్న డబ్బులు ఇవ్వకపోవడంతో పాటు ఉద్యోగాలు కల్పించక పోవడం, ఇచ్చిన డబ్బులకు వడ్డీ లు పెరిగిపోవడంతో కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితులు ఉన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పారిశ్రామిక ప్రాంతానికి చెందిన జక్కుల శ్రీనివాస్ ద్వారా మధుసూదన్ రావు, అతని భార్య ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారు.

బాధితుల డబ్బులు తిరిగి ఇవ్వకుండా భయబ్రాంతులకు గురి చేస్తున్నారని, వారు తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులను ఆశ్రయించినట్లు తెలిపారు. ఉద్యోగాల కోసం తీసుకున్న డబ్బులు తమకు వచ్చేలా పోలీసులు న్యాయం చేయాలని వారు వేడుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News