Monday, December 23, 2024

బిజెపి నేతను నరికి చంపిన మావోయిస్టులు!

- Advertisement -
- Advertisement -

బీజాపూర్: చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో ఉన్న ఉసూర్ బ్లాక్ బిజెపి ప్రెసిడెంట్ నీలకంఠ్ కక్కెమ్‌ను మావోయిస్టులు అతడి కుటుంబ సభ్యుల ఎదుటే నిర్దాక్షిణ్యంగా నరికి చంపారు. ‘సిపిఎంకు చెందిన మావోయిస్టులు గొడ్డళ్లు, ఇతర ఆయుధాలతో నీలకంఠ్‌పై దాడిచేశారు. అతడు అక్కడికక్కడే చనిపోయాడు’ అని ఎసిపి చంద్రకాంత్  చెప్పారు.

ఆవపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పైక్రమ్‌లో మావోయిస్టులు ఒకరిని చంపారని తమకు సమాచారం అందిందని, వెంటనే అక్కడికి చేరుకున్నామని ఏసిపి చంద్రకాంత్ తెలిపారు. ఘటనకు సంబంధించిన వీడియోను స్వాధీనం చేసుకున్నామని, దాడికి 150 మంది మావోయిస్టులు వచ్చినట్లు ఆయన తెలిపారు. అయితే ముగ్గురు మాత్రమే బిజెపి నేత ఇంటికి వెళ్లారని ఆయన చెప్పారు. కాగా దర్యాప్తు కొనసాగుతోందని పోలీసు అధికారులు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News