Friday, December 20, 2024

ఎంఎల్‌ఎల ప్రలోభాల కేసులో వెలుగులోకి వాస్తవాలు: రఘునందన్ రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎంఎల్‌ఎల ప్రలోభాల కేసులో సిబిఐ విచారణలో వాస్తవాలు వెలుగులోకి వస్తాయని బిజెపి ఎంఎల్‌ఎ రఘునందన్ రావు అన్నారు. ఎంఎల్‌ఎల ప్రలోభాల కేసుకు సంబంధించి సిబిఐ విచారణపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ సమర్ధిస్తూ కీలక తీర్పు ఇచ్చిన నేపథ్యంలో సోమవారం అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో రఘునందన్ రావు మాట్లాడారు.. ఎంఎల్‌ఎల ప్రలోభాల కేసులో సిట్‌ను తెలంగాణ ప్రభుత్వం తనకు అనుకూలంగా వాడుకుందని ఆయన ఆరోపించారు. తప్పు చేయకపోతే సిబిఐ విచారణ అంటే భయమెందుకని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలను ఆయన ప్రశ్నించారు. ధైర్యంగా సిబిఐ విచారణ ఎదుర్కొవాలని రఘునందన్ కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News