Monday, December 23, 2024

బిఆర్ఎస్ పార్టీని తక్కువ అంచనా వేయకండి: మంత్రి పువ్వాడ

- Advertisement -
- Advertisement -

ఇప్పటివరకు 18 పార్టీలు కాలగర్భంలో కలిసిపోయాయి

కెసిఆర్ చేయి వదిలేస్తే వాళ్ల గతి అదోగతి

బిఆర్ఎస్ పార్టీని తక్కువ అంచనా వేయకండి

వైరా: ఖమ్మం జిల్లా వైరాలో బిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ తాతా మధు, పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ… తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు 18 పార్టీలు కాలగర్భంలో కలిసిపోయాయని పేర్కొన్నారు. కెసిఆర్ తయారు చేసిన నాయకులు చాలా పెద్దవాళ్లం అనుకుంటున్నారు. ఒక్కసారి కెసిఆర్ చేయి వదిలేస్తే వాళ్లగతి అదోగతి పడుతుందని హెచ్చరించారు. ఎన్టీఆర్ పెట్టిన టిడిపి, కెసిఆర్ పెట్టిన బిఆర్ఎస్ మాత్రమే మనుగడ సాగించాయన్నారు. గ్రూపు రాజకీయాలు మంచివి కావని మంత్రి తెలిపారు. కెసిఆర్ ఎవరికీ అన్యాయం చేయకుండా అందరికీ పదవులు ఇచ్చారు. వైరా బిఆర్ఎస్ బాధ్యత నేను తీసుకుంటున్నాను. బిఆర్ఎస్ పార్టీని తక్కువ అంచనా వేయకండని మంత్రి పువ్వాడ సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News