Monday, December 23, 2024

కోటంరెడ్డికి కార్పొరేటర్ల ఝలక్

- Advertisement -
- Advertisement -

నెల్లూరు: వైసిపి తిరుగుబాటు ఎంఎల్‌ఎ కోటంరెడ్డికి కార్పొరేటర్లు ఝలక్ ఇచ్చారు. 18 కార్పొరేటర్లు, ఎక్స్‌అఫిషియో మెంబర్లు ఆదాల ప్రభాకర్ రెడ్డిని  కలిశారు. కోటం రెడ్డి బలం ఇద్దరు కార్పొరేటర్లకే పరిమితమైంది. వైఎస్‌ఆర్‌సిపితోనే తమ ప్రయాణం ఉంటుందని మెజార్టీ కార్పొరేటర్లు తెలిపారు. వైసిపి పార్టీ ఎవరిని నిర్ణయిస్తే వారు తమ నాయకుడు అని, గతంలో కార్పొరేటర్లు తనని కలవలేని పరిస్థితి నెలకొందని, ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉండదని వైసిపి నేత ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలిపారు. కార్పొరేటర్లకు పూర్తి స్వేచ్ఛ ఉంటుందని, తమ పరిధిలోని సమస్యలను పరిష్కరించుకోవచ్చని సూచించారు. వైసిపి పార్టీ లైన్ దాటితే ఎవరినీ ఉపేక్షిపించబోమని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News