- Advertisement -
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంటర్మీడియేట్ విద్యార్థులకు నాలుగు వేల వీడియో పాఠాలను ఇంటర్ విద్యాశాఖ అందుబాటులోకి తెచ్చింది. జనరల్, ఒకేషనల్‌తో పాటు సామాన్యశాస్త్రం ప్రయోగ పరీక్షల పాఠాలు, పరీక్షలకు సంబంధించిన టిప్స్, ప్రోత్సాహాన్ని ఇచ్చే ప్రసంగాలను కూడా చేర్చింది.
‘యూట్యూట్‌లో డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఇ లెర్నింగ్ తెలంగాణ’ అని సెర్చ్ చేయాలని పేర్కొంది. ఈ అవకాశాన్ని వినియోగించుకుని వార్షిక పరీక్షలకు విద్యార్థులు మరింత సన్నద్ధం కావాలని ఇంటర్ విద్య కమిషనర్ నవీన్ మిట్టల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
- Advertisement -