టర్కీ, సిరియా భూకంపాలకు సంబంధించిన దృశ్యాలు గుండెల్ని పిండేస్తున్నాయి. సహాయక చర్యల్లో స్థానికులు పాల్గొని ఎందరినో కాపాడుతున్నారు. తాజాగా సిరియా అలెప్పోలో ఓ తల్లి శిథిలాల కిందే బిడ్డను ప్రసవించింది. దురదృష్టం కొద్దీ ప్రసవించిన వెంటనే ఆ తల్లి కన్నుమూసింది. శిథిలాల తొలగింపు క్రమంలో ఇది గమనించిన స్థానికులు,ఆ బిడ్డను హుటాహుటిన వైద్యం కోసం తరలించారు. ప్రస్తుతం ఆ బిడ్డ పరిస్థితి నిలకబడగానే ఉన్నట్లు తెలుస్తోంది.
The moment a child was born 👶 His mother was under the rubble of the earthquake in Aleppo, Syria, and she died after he was born , The earthquake.
May God give patience to the people of #Syria and #Turkey and have mercy on the victims of the #earthquake#الهزه_الارضيه #زلزال pic.twitter.com/eBFr6IoWaW— Talha Ch (@Talhaofficial01) February 6, 2023
తమ్ముడి తలకు చేయి అడ్డుపెట్టి…
భూకంపం ధాటికి కుప్పకూలిన ఓ భవన శిథాలల కింద 10 ఏళ్ల లోపు వయసున్న అక్కా తమ్ముడు ఇరుక్కున్నారు. భవనం స్లాబ్ విరిగి వాళ్లపై పడింది. అయితే అదృష్టం కొద్ది స్లాబ్‌కు ఒకవైపు నేల, మరోవైపు పిల్లర్ సపోర్టు కావడంతో దానికింద వాళ్లు నలిగిపోకుండా ప్రాణాలతో ఉన్నారు.
అయితే, అంతటి భయకరమైన పరిస్థితుల్లోనూ ఆ 10 ఏండ్ల బాలిక మానవత్వాన్ని చాటుకున్నది. విరిగిన స్లాబ్ ఇంకేమాత్రం జారినా ఇద్దరం ప్రాణాలు కోల్పోతామని తెలిసి కూడా తమ్ముడి తలకు తన చేతిని అడ్డుపెట్టింది. చావు కౌగిట్లోనూ ఆ బాలిక పడుతున్న తపన అందరి హృదయాలను హత్తుకుంది.
This video broke my heart 💔
The little girl says to the rescuer when he reaches her: Get me out from under this wreckage,sir,me and my sister, and I will become your slave.#earthquakeinturkey #Syria #هزه_ارضيه #زلزال #İstanbul #earthquake #Turkey #PrayForTurkey pic.twitter.com/U9mMrZdROM
— Zuher Almosa (@AlmosaZuher) February 7, 2023