Tuesday, December 24, 2024

ఎపిలోని నష్టాల్లో ఉన్న ఎయిర్‌పోర్టులు లీజుకు ఇస్తాం: కేంద్రం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి, విజయవాడ, రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టులను లీజ్‌కు ఇచ్చేందుకు రంగం సిద్దం చేసినట్లు కేంద్రం ప్రకటించింది. ఈ అంశంపై రాజ్యసభలో సభ్యుడు బీదా మస్తాన్ రావు అడిగిన ప్రశ్నకు కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయమంత్రి వి.కె. సింగ్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.

ఆర్థికపరమైన ఒడి దుడుకులు ఎదుర్కొంటున్న తిరుపతి ఎయిర్‌పోర్టుతో పాటు ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నడుస్తున్న 25 విమానాశ్రయాలను లీజుకు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. వాటిలోనే తిరుపతి, విజయవాడ, రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టులు ఉన్నట్లు ఆయన వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News