- Advertisement -
హైదరాబాద్: రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా గచ్చిబౌలిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటలిటీలో యంగ్ హీరోయిన్ శ్రీలీల మొక్కలు నాటారు. ఈ సందర్భంగా శ్రీలీల మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు.గ్రీన్ ఇండియా చాలెంజ్ ద్వారా 17కోట్లకు పైగా మొక్కలు నాటడం గొప్ప విషయమన్నారు.
ప్రతి ఒక్కరు ఈ చాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని కోరారు. ఇంత మంచి కార్యక్రమం ప్రారంభించిన ఎంపి సంతోష్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం గ్రీన్ ఇండియా చాలెంజ్ కో ఫౌండర్ రాఘవ వృక్ష వేదం పుస్తకాన్ని శ్రీలీలకు బహుకరించారు.. ఈ కార్యక్రమంలో ఎన్‌ఐటిహెచ్‌ఎం డైరెక్టర్ శేరి చిన్నప్ప రెడ్డి,విద్యార్థులు పాల్గొన్నారు.
- Advertisement -