Saturday, December 21, 2024

ప్రధానమంత్రి అవాస్ యోజన పథకం.. ప్రియుళ్లతో లేచిపోయిన ప్రియరాళ్లు

- Advertisement -
- Advertisement -

లక్నో: ప్రధానమంత్రి అవాస్ యోజన కింద వచ్చిన డబ్బులు తీసుకొని ప్రియుళ్లతో ప్రియురాళ్లు లేచిపోయిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం బారాబంకీ జిల్లాలో జరిగింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం…. ఇల్లు లేని నిరుపేదలకు ప్రధానమంత్రి అవాస్ యోజన కింద మోడీ ప్రభుత్వం మూడు లక్షల రూపాయలు ఇస్తుంది. దీంతో బారాబంకీ జిల్లా నుంచి 40 మంది మహిళలను లబ్ధిదారులుగా ఎంపిక చేయడంతో పాటు మొదటి విడుతగా 50 వేల రూపాయలను మంజూరు చేసింది. బ్యాంక్ ఆకౌంట్‌లో డబ్బులు పడగానే ఐదుగురు మహిళలు తన భర్తలను వదిలేసి ప్రియుళ్లతో పారిపోయారు. దీంతో రెండో విడత డబ్బులు తన భార్యాల ఖాతాల్లో జమ చేయవద్దని అధికారులను భర్తలు వేడుకుంటున్నారు. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News