Saturday, December 21, 2024

మిస్టర్ ధర్మ మూవీ ట్రైలర్ రిలీజ్…

- Advertisement -
- Advertisement -

శ్రీ వెంకటేశ్వరస్వామి మూవీస్ పతాకంపై, ప్రదీప్ రాజ్ దర్శకత్వంలో, రమేష్ ఆర్.కె. నిర్మిస్తున్న చిత్రం మిస్టర్ ధర్మ (బ్రదర్ ఆఫ్ యమ). ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ వేడుక ఫిలింఛాంబర్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు బసిరెడ్డి, ప్రముఖ రచయిత, దర్శకుడు వడ్డేపల్లి కృష్ణ, దర్శకుడు బాజ్జీ, నటుడు కోట శంకరరావు, శాంత కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బసిరెడ్డి మాట్లాడుతూ… బడ్జెట్ చిత్రాల నిర్మాతలు పడుతున్న బాధలను ప్రముఖ రచయిత, దర్శకుడు బాజ్జీ గారు చెప్పిన విషయాల పట్ల ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడిగా నా వంతు కృషి చేస్తున్నాను.

చిన్న నిర్మాతల సాదక బాధకాలను దృష్టిలో పెట్టుకొని చిన్న చిత్రాల రిలీజ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ ద్వారా షేరింగ్ విధానంలో కొన్ని చిత్రాలను విడుదల చేయడం కూడా జరిగింది. అనుకోని కారణాల వలన ఈ కమిటీ కార్యక్రమాలు సజావుగా జరగడం లేదు. ఈ విషయం పై తగిన చర్య తీసుకుంటానని బసిరెడ్డి అన్నారు. మిస్టర్ ధర్మ బ్రదర్ ఆఫ్ యమ చిత్రం పోస్టర్ చూడగానే ప్రముఖ నటీనటులు నటించిన చిత్రంగా కనిపించింది. కమర్షియల్ అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ దర్శకుడు ప్రదీప్ రాజ్ చిత్రాన్ని తీసారనుకుంటున్నాను. దర్శక నిర్మాతల ప్రయత్నం సక్సెస్ కావాలని ఆకాంక్షించారు. తదుపరి బసిరెడ్డి చిత్ర ట్రైలర్ను విడుదల చేసారు.

చిత్ర నిర్మాత రమేష్ ఆర్.కె మాట్లాడుతూ ముంబాయ్ ప్రాంతానికి చెందిన తెలుగువాడు అయిన నేను మంచి కథా బలం గల చిత్రాల నిర్మాణం జరపడానికి ఇండస్ట్రీకి వచ్చాను. పోలీస్ స్టోరీ బ్యాక్రాప్ లో చిత్రం చేయడానికి గాను దర్శకుడిని కథ చెప్పమని అడిగాను. నా భావాలకు అనుగుణంగా మంచి సన్నివేశాలు, పాటలు, ఫైట్స్ ప్రాధాన్యతను ఇస్తూ చిత్రాన్ని అనుకున్న విధంగా దర్శకుడు పూర్తి చేసారు. ప్రముఖ నటులు భానుచందర్, కోట శంకరరావు, శాంతి కుమార్ తదితరులు తమ పాత్రలకు తగిన న్యాయం చేసారనుకుంటున్నాను. కామెడీ, రొమాన్స్కు కూడా మంచి ప్రాధాన్యత ఉంది. చిత్రాన్ని త్వరలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం అన్నారు.

కోట శంకరరావు మాట్లాడుతూ మంచి కథా బలం గల చిత్రాన్ని దర్శక నిర్మాతలు ఎన్నుకొన్నారు. ఇందులో నాకు మంచి పాత్ర ఇచ్చారన్నారు. శాంతి కుమార్ మాట్లాడుతూ కామెడీ ప్రాధాన్యత కలిగిన పాత్రను పోషిస్తున్నానని చెప్పారు. సమావేశంలో పాల్గొన్న వడ్డేపల్లి కృష్ణ, దర్శకుడు బాజ్జీ, దర్శక నిర్మాతలు తొలి ప్రయత్నంగా చేస్తున్న ఈ చిత్రం విజయాన్ని సాధించాలని ఆకాంక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News