Thursday, December 26, 2024

దేశానికే ధాన్యాగారం తెలంగాణ: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దేశానికే అన్నం ధాన్యాగారంగా తెలంగాణ మారిందని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. శాసన మండలిలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా హరీష్ రావు మాట్లాడారు. ఇతర రాష్ట్రాల నుంచి కూలీ పని కోసం తెలంగాణకు వలస వస్తున్నారని, వరి నాట్లు వేసేందుకు ఛత్తీస్‌గఢ్ నుంచి కూలీలు వస్తున్నారని, పత్తి ఏరాలంటే కర్నాటక, హమాలీ పని కోసం బీహార్ నుంచి వస్తున్నారని తెలియజేశారు. మిర్చీ ఏరేందుకు మహారాష్ట్ర నుంచి కూలీలు వస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు వల్లే ఇన్ని విజయాలు సాధ్యమయ్యాయని వివరించారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ అడుగడుగునా వివక్షకు గురైందన్నారు. సిఎం కెసిఆర్ పాలనలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని హరీష్ రావు ప్రశంసించారు. కాళేశ్వరం ప్రాజెక్టును ప్రపంచం మొత్తం మెచ్చుకుంటోందని, కాళేశ్వరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేశామని కొనియాడారు. తెలంగాణలో భూమికి బరువయ్యే పంట పండుతోందన్నారు. తెలంగాణ పథకాలను ఇతర రాష్ట్రాలు కాఫీ కొడుతున్నాయన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News