Monday, December 23, 2024

యువతలో “స్ట్రోక్ ”రిస్కు ఎందుకు ఎక్కువ?

- Advertisement -
- Advertisement -

గుండెపోటు, స్ట్రోక్ పెద్దలకు, వృద్ధులకు మాత్రమే వస్తాయని భావించే రోజులు పోయాయి.ఇప్పుడు పాతికేళ్ల యువతకు కూడా ఈ రిస్కు ఎక్కువగా ఉంటోంది. అలా ఎందుకు జరుగుతోంది? ఏమాత్రం కదలిక లేని జీవన శైలి అన్ని అనర్ధాలకు కారణమౌతోంది. స్మోకింగ్, ఆల్కహాల్ సేవించడం, స్థూలకాయం, డయాబెటిస్, రక్తపోటు, కుటుంబ చరిత్ర, గుండె జబ్బులు, తదితర సమస్యలు గుండెపోటుకు, స్ట్రోక్‌లకు దారి తీస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్యసంస్థ (who) వివరాల ప్రకారం ప్రపంచం మొత్తం మీద సంభవించే ఆకస్మిక మరణాలకు రెండో పెద్ద కారణం స్ట్రోక్ అని స్పష్టమౌతోంది. ప్రతి ఏటా దాదాపు 13 మిలియన్ మంది స్ట్రోక్‌తో బాధపడుతున్నారు. అలాగే ఏటా సుమారు 5.5 మిలియన్ మంది మరణిస్తున్నారు. భారత్‌లో ఈ పరిస్థితి చాలా ప్రమాదకరంగా పెరుగుతోంది. ప్రతి 40 నిమిషాలకు ఒకరు స్ట్రోక్‌కు గురవుతున్నారు.

స్ట్రోక్ అంటే ఏమిటి ?
క్షణకాలం రక్తప్రసరణ ఆగిపోవడాన్ని లేదా సెరెబ్రోవాస్కులర్ యాక్సిడెంట్ (cerebrovascular accident)స్ట్రోక్ అంటారు. మెదడుకు ప్రవహించే రక్తం ఆగిపోవడం వల్ల స్ట్రోక్ ఏర్పడుతుంది. దీనివల్ల మెదడుకు కావలసిన ఆక్సిజన్, పోషకాలు రక్తం నుంచి అందకుండా పోతుంది. ఆక్సిజన్, పోషకాలు లోపించడంతో మెదడు లోని జీవకణాలు క్షణాల్లోనే చనిపోవడం ప్రారంభమై మెదడుకు నష్టం జరుగుతుంది. సుదీర్ఘకాలం వైకల్యం ఏర్పడుతుంది. మరణానికి కూడా దారి తీయవచ్చు.

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చి (icmr) ఇటీవలి అధ్యయనం కొన్ని ముఖ్యమైన అంశాలను వెలుగు లోకి తెచ్చింది. ఈ పరిస్థితి సాధారణంగా చాలా తక్కువమందిలో కనిపించినా, యువజనంలో 10 నుంచి 15 శాతం వరకు అన్ని రకాల స్ట్రోక్‌లు కనిపిస్తున్నాయి. ఫలితంగా ఐదో వంతు మంది ఆస్పత్రి పాలవ్వక తప్పడం లేదు. యువకుల వ్యక్తిగత జీవితంలోని క్రియాశీలక సంవత్సరాలపై వినాశనకర ప్రభావం పడుతోంది. చాలా సాధారణంగా రక్తనాళాల్లో రక్తప్రసరణకు ఆటంకం (ischemicstroke) కలుగుతుండడం జరుగుతోంది. రక్తనాళాల ద్వారానే మెదడుకు రక్తం ప్రసారం అవుతుంటుంది.

స్ట్రోక్‌కు మిగతా ముఖ్యమైన కారణాలలో సబ్‌అరాచ్‌నాయిడ్ హెమెరేజి (subarachnoid hemorage ) ఒకటి. ఆర్చనాయిడ్ పొర అంటే మెదడు లోని మధ్య పొరకు, లోపలి పొరకు మధ్యనున్న ప్రదేశం . ఈ రెండు పొరల మధ్య రక్త స్రావం (bleeding) జరిగితే సబ్‌అరాచ్‌నాయిడ్ హెమెరేజి జరుగుతుంది. అంటే రక్తనాళాలు చిరిగిపోతాయి. అలాగే ఇంట్రాక్రేనియల్ హెమరేజ్ (intracranial hemorage ) అంటే కపాలం లోపల రక్తనాళాలు చిదిగిపోతే రక్తస్రావం జరుగుతుంది. దీంతో సాధారణంగా రక్తపోటు ఏర్పడుతుంది. ఈ రెండు ముఖ్యకారణాలు 40 నుంచి 55 శాతం యువజనుల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి.

స్ట్రోక్ లక్షణాలు
స్వల్ప నీరసం నుంచి పక్షవాతం వరకు ఈ లక్షణాలే. శరీరం లో లేదా ముఖంలో ఒక వైపు భాగం పక్షవాతం వస్తుంది. ముఖం వంగి పోతుంది. భుజం బలహీనమౌతుంది. మాట్లాడడం కష్టంగా ఉంటుంది. ఈ లక్షణాలు కనిపించగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా అమృత క్షణాల్లో చికిత్స అందించగలిగితే చాలా వరకు రక్షించుకోగలుగుతాం. యువకుల్లో అకస్మాత్తుగా గందరగోళం, మాట్లాడడంలో లేదా అర్థం చేసుకోవడంలో ఇబ్బంది,చూపు మందగించడం, సమతూకం తప్పడం, మాంద్యం, నడవలేక పోవడం , అకస్మాత్తుగా తీవ్రమైన తలనొప్పి, ఇవన్నీ స్ట్రోక్ లక్షణాలుగా గమనించాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News