Sunday, December 22, 2024

సిఎం కెసిఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం

- Advertisement -
- Advertisement -

సదాశివనగర్ : కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల కేంద్రంలోని ఐకెపి కార్యాలయం వద్ద గురువారం సేర్ప్ ఉద్యోగులు సిఎం కెసిఆర్ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేసారు. ఈ సందర్భంగా ఎపియం రాజిరెడ్డి మాట్లాడారు. గత 22 సంవత్సరాలుగా చాలీచాలని వేతనాలతో కష్టాలు పడుతూ పే స్కేల్ కోసం ఎదురు చూసిన సెర్ప్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం పే స్కేల్ అమలు చేసి ఆదుకుందని చెప్పారు. అసెంబ్లీ సమావేశంలో పే స్కేల్ ఏప్రిల్ ఒకటి 2023 నుండి అమలు చేయాలని ప్రకటించినందుకు ఐకెపి ఉద్యోగుల తరపున కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపియం రాజిరెడ్డి, సీసీలు గొర్రె రాములు, అబ్బలింగం, నరెందర్ రెడ్డి, కృష్ణాంజలి, సౌజన్య, అకౌంటెంట్ రమేష్, మండల సమైఖ్య అద్యక్షురాలు రజిత, కోశాదికారి సుజాత సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News