Monday, December 23, 2024

పంజాబ్‌లో బాలుడి నుంచి 15 కిలోల హెరాయిన్ స్వాధీనం

- Advertisement -
- Advertisement -

చండీగఢ్: సరిహద్దుల మీదుగా జరుగుతున్న మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడంలో పంజాబ్ పోలీసులు మరో విజయం సాధించారు. ఒక 17 ఏళ్ల మైనర్ బాలుడి నుంచి 15 కిలోల బరువున్న 15 ప్యాకెట్ల హెరాయిన్‌ను, రూ. 8.4 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పంజాబ్ డిజిపి గౌరవ్ ఓదవ్ గురువారం విలేకరులకు ఈ విషయం వెల్లడించారు.

అమృత్‌సర్‌కు చెందిన మైనర్ బాలుడి నుంచి డ్రగ్స్ రవాణాకు ఉపయోగించిన హీరో డీలక్స్ మోటార్‌సైకిల్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పాకిస్తాన్‌కు చెందిన స్మగ్లర్లు డ్రోన్ ద్వారా ఈ డ్రగ్స్‌ను జారవిడిచారని, వీటిని డెలివరీ చేయడానికి వెళుతుండగా ఆ బాలుడిని పక్కా సమాచారంతో అరెస్టు చేశామని డిజిపి తెలిపారు. ఆ బాలుడి తండ్రి, తాత కూడా డ్రగ్స్ సరఫరా కేసులో ఇదివరకే అరెస్టయి జైలులో మగ్గుతున్నారని కూడా ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News