- Advertisement -
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా తుమ్మనూరు వద్ద శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. డిసిఎంను కారు ఢీకొట్టడంతో నలుగురు దుర్మరణం చెందారు. మృతులు శ్రీనివాసులు, కేశవులు, యాదయ్య, రామస్వామిగా గుర్తించారు. హైదరాబాద్‌లో వంట చేసేందుకు వచ్చి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు నాగర్ కర్నూలు జిల్లా వెల్ధండ గ్రామ వాసులుగా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
- Advertisement -