Monday, December 23, 2024

మహిళా కానిస్టేబుల్‌ను కాల్చి చంపిన ప్రియుడు

- Advertisement -
- Advertisement -

పాట్నా: మహిళా కానిస్టేబుల్‌ను ఆమె ప్రియుడి గన్‌తో కాల్చి చంపిన సంఘటన బిహార్ రాష్ట్రం కతిహార్‌లో జరిగింది. ఈ కేసులో ఏడుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కోదా పోలీస్ స్టేషన్ పరిధలోని భట్వారా గ్రామంలో ప్రభ కుమారి అనే కానిస్టేబుల్ తన తల్లిదండ్రులతో కలిసి ఉంటుంది. ప్రభకు చోటు అలియాస్ అర్షద్‌తో మధ్య అక్రమ సంబంధం ఉన్నట్టు సమాచారం. గత కొన్ని రోజుల నుంచి చోటును ప్రభ దూరంగా పెట్టడంతో ఆమెను అతడు పలుమార్లు బెదిరించాడు. ఆమెను చంపేస్తానని ఫోన్‌లో అతడు పలుమార్లు బెదిరించారని ప్రభ కుటుంబ సభ్యులు ఆరోపణలు చేశారు. చోటు ప్రభ తలపై గన్‌తో కాల్చడంతో ఆమె ఘటనా స్థలంలో చనిపోయింది. నిందితుడు ఘటనా స్థలం నుంచి పారిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి నిందితుడితో సహా ఏడుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం కతిహార్ ఆస్పత్రికి తరలించారు. ఇద్దరు మధ్య ఉన్న లవ్ ఎఫైర్ కానిస్టుబుల్ ప్రాణాలు తీసిందని అనుమానా వ్యక్తమవుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News