Monday, December 23, 2024

సచివాలయ గుమ్మటాలను కూలుస్తాం: బండి

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: బిజెపి అధికారంలోకి వస్తే సచివాలయ రూపురేఖలు మారుస్తామని ఎంపి, బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ తెలిపారు. ప్రజాగోస బిజెపి భరోసా యాత్రలో భాగంగా బండి మాట్లాడారు. సచివాలయానికి ఉన్న గుమ్మటాలు కూలుస్తామన్నారు. మన సంస్కృతికి వ్యతిరేకంగా ఉన్న గుమ్మటాలు కూలుస్తామని హెచ్చరించారు. సచివాలయాన్ని ఎంఐఎం నేత అక్బరుద్ధీన్ తాజ్‌మహల్‌తో పోల్చారన్నారు. అక్బరుద్ధీన్ ఓవైసి వ్యాఖ్యలు విని సిఎం కెసిఆర్ ఆనందించారన్నారు. పాతబస్తీ వెనుకబాటుకు ప్రధానం కారణం ఎంఐఎం, బిఆర్‌ఎస్ అని మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News