Saturday, December 21, 2024

తెలంగాణలో రామ..చంద్రుల పాలన: మంత్రి మల్లారెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రామచంద్రుల పాలన నడుస్తోంది..రాముడు అంటే రామారావు(కెటిఆర్)..చంద్రుడు అంచే కేసిఆర్ ..ఒకప్పుడు రామరాజ్యం విన్నాం ..ఇప్పుడు తెలంగాణకు ఐటి రాజ్యం తెచ్చిన ఘనత కేటిఆర్‌కే దక్కుతుంది ..ఉద్యమ చంద్రుడు ఇవాళ సూర్యుడు అయ్యాడు..కేసిఆర్ పీఎం అవుతాడు..కేటీఆర్ సీఎం అవుతాడు అంటూ రాష్ట్ర కార్మిక శాఖమంత్రి మల్లారెడ్డి రాష్ట్ర శాసనసభలో నవ్వులు పూయించారు. శుక్రవారం మంత్రి మల్లారెడ్డి అసెంబ్లీలో హామారా సిఎం కేసిఆర్ హై ..హమారా దేశ్‌కి నేత హై అంటూ పంచ్ విసిరారు. ఇక్కడి వాతావరణం అన్నింటికీ అనుకూలం అన్నారు. మన ఎదుగుదల చూసి(బిజేపి) ఓర్వలేకపోతుందన్నారు..కేంద్ర ప్రభుత్వం రైళ్లు, విమనాలు,, బోట్లు..ఎల్‌ఐసి తదితర సంస్థలు అమ్మటానికి చూస్తోందన్నారు. కార్మికులను రోడ్లమీద పడేస్తందన్నారు.

పెట్రోల్ డీజిల్ ధరలు పెంచారు..నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి ..పెద్దలకు సవాల్ ..దేశంలో మంచి వనరులు పుష్కలంగా ఉన్నాయి. ఒక్కసారి దేశాధినేతగా అవకాశం ఇస్తే ఎలా అభివృద్ధి చేయాలో మన సిఎం చేసి చూపిస్తారని మంత్రి అన్నారు.. మన కేసిఆర్ తెలంగాణ జాతిపిత.. ఒకే ఒక్క బక్కపల్చటోడు చేసి చూపుతాడు .. ప్రతిపక్షపార్టీలను ఏకం చేస్తాడు..బలవంతమైన సర్పము చలిచీమలచేత చిక్కిచావటం ఇది బిజేపి వారికి కరెక్ట్‌గా సూట్ అవుతుంది.. మెం ట్రెండ్ ఫాలోకాము.. ట్రెండ్ సెట్ చేస్తాం అన్నారు.. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న మిషన్ కాకతీయ, మిషన్ భగీరధ, కళ్యాణలక్ష్మి , షాది ముబారక్ వంటి ఎన్నో పథకాలు దేశానికే ఆదర్శంగా ఉన్నాయన్నారు. చల్లని చెట్టుకింద సేదదీరాలేకాని చెట్టుకు అగ్గిపెట్టాలనుకోరాదు .. కేసిఆర్ ఫైర్ అయిండంటే మాడి మసి అయిపోతారు.. తగ్గేదేలా..అంటూ పంచ్‌లు విసిరారు..మా సిఎం కేసిఆర్ కార్మికుల సంక్షేమమే లక్షంగా కృషి చేస్తున్నారు..నాకు తెలిసిన ఒకరు 20 ఏళ్లకిందట అమెరికాలో ఉండి వచ్చారు .

అక్కడ ఎక్కడికి పోయినా అవే రోడ్లు ..అవే బిల్డిగులు ..అవే కార్లు.. కాని తెలంగాణలో రోడ్లు .భవనాలు ..కార్లు చూసి అశ్చర్యపోయారు.. కోటి చేసిది 5కోట్లు అయింది..ఖమ్మం పోయినా అంతే ఉంది..ఎంతో మార్పు అని ఆశ్చర్య పోయాడు.. మా ఇంటి పక్కన ఒక పనిమనిషి ఇంటికి కెనిటిక్‌లో వస్తుంది…అలికి ముగ్గేసి పదినిమిషాల్లో పని ముగించి పోంతుంది..ఎన్నో చోట్ల పనిచేస్తుంది.. ఎంత మార్పు వచ్చిందో మన తెలంగాణలో… ఇదంతా మన కేసిఆర్ మన కేటిఅర్ వల్లనే కదా.. కరోనాలో ఇతర రాష్ట్రాల కూలీలను ఎంతో బాగా చూసుకున్నారు.. వారిని ప్రత్యేక రైళ్లలో గౌరవ మర్యాదలతో పంపారు..అందుకే వెల్లిన వారంతా వారి బంధువులను కూడా వెంటతీసుకుని మళ్లీ పనికోసం ఇక్కడికే వచ్చారు.. అని మంత్రి మల్లారెడ్డి వివరించారు.. వివేక్ , ఈటెల మీద ఐటి దాడులు చేయాలని డిమాండ్ చేశారు.

చాయ్ అమ్మినట్టు పబ్లిక్ ప్రాపర్టీని అమ్ముతున్నారు..ఇప్పుడు సింగరేణిని కూడా అమ్ముతామంటున్నారు…అంటూ మంత్రి పంచ్‌డైలాగులతో ఫుల్‌లెన్త్ కామెడీని పండించారు. మంత్రి మాట్లాడుతున్నంత సేపు అధికార , విపక్ష పార్టీలకు చెందిన శాసనసభ్యుల ముఖాల్లో చిరునవ్వులు విరబూశాయి. తనదైన హావభావాలతో మంత్రి మల్లారెడ్డి ఛలోక్తులతో కూడిన విమర్శలు, పంచుల మీద పంచు డైలాగులతో విదూషకుడిని మించిన రీతిలో సభను అలరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News