Tuesday, January 21, 2025

హజ్ యాత్రకు దరఖాస్తు గడవు మార్చి10

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : హజ్ యాత్రకు వెళ్ళేందుకు మార్చి 10 లోగా దరఖాస్తు చేసుకోవాలని హజ్ కమిటి చైర్మన్ మొహమ్మద్ సలీం, ఎగ్జిక్యూటివ్ అధికారి బి. షఫిఉల్లా సూచించారు. హజ్ దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 10 నుండి ప్రారంభమయ్యిందన్నారు. కేంద్ర హజ్ కమిటి వెబ్‌సైట్ www.hajcommittee.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 31 డిసెంబర్ 2023 వరకు వ్యాలిడిటి ఉండే పాస్‌పోర్ట్ ను అప్‌లోడ్ చేయాలన్నారు.

హైదరాబాద్ జంటనగరాలకు సంబంధించిన హజ్ యాత్రీకులు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోడానికి హజ్ హౌస్‌లో ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ఫిబ్రవరి 13 నుండి హజ్ హౌస్‌లో ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పించేందుకు కౌంటర్లు పనిచేస్తాయన్నారు. జిల్లాల్లో జిల్లా హజ్ ప్రతినిధులకు సంప్రదించాలన్నారు. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News