Monday, December 23, 2024

ప్రేమ పెళ్లి… సోషల్ మీడియాలో నగ్న వీడియోలు… భార్యను కత్తితో పొడిచి

- Advertisement -
- Advertisement -

 

అమరావతి: ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడు… అనుమానంతో భార్య నగ్న వీడియోలను సోషల్ మీడియా షేర్ చేసి వెలకట్టాడు. అనంతరం భార్యను కత్తితో పొడిచి హత్య చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లా ముసునూరు మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఎన్‌టిఆర్ జిల్లాకు చెందిన షేక్ నాగుల్ మీరాకు మొదటి భార్యతో గొడవలు జరగడంతో విడాకులు తీసుకున్నాడు. తన అక్క ఊరు రమణక్కపేటలో ఉంటూ కూలీనాలీ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అదే గ్రామంలో జ్యోత్స(29)ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు తాపీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

గత సంవత్సరం నుంచి ఆమె పవర్తనపై అనుమానం రావడంతో ఇద్దరు మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో జ్యోత్స ఫోన్ తీసుకెళ్లి ఆమె నగ్న వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేసి వేలం కట్టాడు. అనంతరం ఏమీ తెలియనట్లు ఇంటికి వచ్చి ఆమె తల్లికి ఫోన్ ఇచ్చి బయటకు వెళ్లిపోయాడు. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్లు రావడంతో వాళ్లు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే భర్త కనిపించకుండ పోయాడు. అనుమానంతో రగిలిపోయిన భర్త ఆమెను చంపాలని నిర్ణయం తీసుకున్నాడు. గురువారం రాత్రి ఆమె ఉంటున్న ఇంటికి కొంచెం దూరంలో చెట్టు చాటున దాక్కున్నాడు. ఆమె ఆటు వైపు వస్తుండగా కత్తితో పలుమార్లు పొడిచి ఘటనా స్థలం నుంచి పారిపోయాడు. స్థానికులు గమనించి వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. కానీ ఆమె అప్పటికే చనిపోయిందని పరీక్షించిన వైద్యులు వెల్లడించారు. బాధితురాలు తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News