- Advertisement -
న్యూస్‌డెస్క్: టర్కీలో భూకంప బాధితులకు భారత సైన్యం అందచేస్తున్న సహాయక చర్యలు అందరి ప్రశంసలను అందుకుంటున్నాయి. భారత సైన్యానికి చెందిన ఒక వైద్యురాలిని ఒక టర్కీ మహిళ కృతజ్ఞతాపూర్వకంగా బుగ్గన ముద్దు పెట్టుకుంటున్న ఫోటో సోషల్ మీడియాలో నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది. ఈ ఫోటోను ఇండియన్ ఆర్మీ తన అధికారిక ట్విటర్ ఖాతాలో శనివారం పోస్ట్ చేసింది.
ఆపరేషన్ ‘దోస్త్’ పేరుతో టర్కీ, సిరియాలో భారత సైన్యం పెద్ద ఎత్తున సహాయక చర్యలు సాగిస్తోంది. ఇండియన్ ఆర్మీకి చెందిన మహిళా డాక్టర్‌ను టర్కీకి చెందిన మహిళ బుగ్గన ముద్దాడుతున్న దృశ్యాన్ని 10 లక్షల మందికి పైగా ట్విటర్‌లో వీక్షించారరు. మానవతా దృక్పథంలో భారతీయ సైన్యం అక్కడ బాధితులకు అందచేస్తున్న సేవలను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
- Advertisement -