Saturday, November 23, 2024

వరుస హత్యలతో చెలరేగుతున్న రౌడీషీటర్లు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః కత్తి పట్టుకున్నవాడు దానికే బలవుతాడనే సామెత నగరంలోని రౌడీషీటర్లకు అక్షరాల నప్పుతుంది. గత కొంత కాలం నుంచి హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని రౌడీలు వరుసగా హత్యలు చేస్తున్నారు. ఈ హత్యలు తమ ప్రత్యర్థులైన రౌడీషీటర్లను నడిరోడ్లపై హత్యలు చేస్తున్నారు. సిసిటివిలు ఉన్నాయి, పోలీసులు పట్టుకుంటారనే ఎలాంటి భయం లేకుండా యథేచ్ఛగా హత్యలు చేస్తున్నారు. తమకు అడ్డు వస్తే ఎవరినైనా లేపివేస్తామని డైరెక్ట్‌గా వార్నింగ్ ఇస్తున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పాతబస్తీ, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని రాజేంద్రనగర్ ప్రాంతాల్లో రౌడీల ఆగాలు ఎక్కువగా ఉన్నాయి, అదే విధంగా హత్యలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి.

హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బహదురుపుర పోలీస్ స్టేషన్ పరిధిలో వరుసగా రెండు హత్యలు రెండు రోజుల వ్యవధిలోనే చోటుచేసుకున్నాయి. ఈ హత్యలు చనిపోయిన వారు, చంపిన వారు రౌడీషీటర్లే, గతంలో వారి మధ్య వివాదాలు ఉండడంతో దానిని ఆసరా చేసుకుని హత్య చేశారు. ఫలక్‌నుమా పోలీస్ స్టేషన్ పరిధిలో కాలాపత్తర్‌కు చెందిన రౌడీషీటర్ నవాబ్‌సాబ్‌ను ప్రత్యర్థులు కత్తులతో పొడిచి హత్య చేశారు. బోయిన్‌పల్లిలో ముసా అనే రౌడీషీటర్‌కు ఇద్దరు ప్రత్యర్థులు కత్తులతో పొడిచి హత్య చేశారు. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీషీటర్లు వరుసగా హత్యలకు పాల్పడుతున్నారు. లంగర్‌హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీషీటర్‌ను నిందితులు ఆటోలోనే గొంతు కోసం హత్య చేశారు.

బహదుర్‌పుర పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు రౌడీషీటర్లు హత్యకు గురయ్యారు. ఒకరిని కుటుంబ కలహాల వల్ల, మరొకరిని పాతకక్ష నేపథ్యంలో హత్య చేశారు. జియాగూడ సమీపంలోని హత్య కేసులో నిందితులు సంచలనం కోసం తమ స్నేహితుడిని హత్య చేసినట్లు పోలీసులకు చెప్పారు. ఇలా చిన్న చిన్న కారణాలతో రౌడీలు ఒకరిని ఒకరు పోడిచి చంపుకుంటున్నారు.

అన్నీ ప్రతీకార హత్యలే…
రౌడీషీటర్ల హత్యలు అన్నీ ప్రతీకార హత్యలే చోటుచేసుకుంటున్నాయి. చంపుతున్నవారు, హత్యకు గురైన వారు ఇరువురు రౌడీషీటర్లు కావడంతో చాలా కేసుల్లో ప్రతీకార హత్యలే జరుగుతున్నాయి. గతంలో ఇరువురు రౌడీషీటర్లు ఏదో ఒక విషయంలో గొడవపడడంతో వారి మధ్య వివాదాలు నెల కొంటున్నాయి. దీనిని మనసులో పెట్టుకుంటున్న రౌడీలు అదును చూసి హత్యలు చేస్తున్నారు. తమకు అడ్డు వస్తున్నారని చాలామందిని రౌడీషీటర్లను హత్య చేస్తున్నారు. కొందరు వివాహేతర సంబంధాలకు అడ్డు వస్తున్నారని హత్య చేస్తున్నారు. రాజేంద్రగనగర్‌లో హత్యకు గురైన రౌడీషీటర్ తనకు అడ్డు వస్తున్నాడని మరో రౌడీషీటర్‌ను హత్య చేశారు.

కౌన్సెలింగ్….నిఘా ఎక్కడ…
పోలీసుల నిర్లక్షం వల్లే రౌడీలు నగరంలో రెచ్చి పోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో పోలీసులు రౌడీలపై ఉక్కు పాదం మోపేవారు. కానీ గత కొంత కాలం నుంచి వారిని పట్టించుకోకపోవడంతో యథేచ్చగా హత్యలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సస్పెక్ట్‌షీట్, రౌడీషీట్ ఉన్నవారిపై పోలీసులు నిరంతరం నిఘా పెట్టేవారు, తరచూ పోలీస్ స్టేషన్లకు పిలిచి వారికి కౌన్సెలంగ్ నిర్వహించేవారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News