Monday, December 23, 2024

చెక్ డ్యామ్‌లను వేగంగా పూర్తిచేస్తాం: హరీశ్‌రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా వివిధ దశల్లో ఉన్న చెక్‌డ్యామ్‌లను వేగంగా పూర్తిచేస్తామని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. శనివారం శాసనసభ ప్రశ్నోత్తరల్లో చెక్‌డ్యాముల నిర్మాణంపై సభ్యులు అత్రం సక్కు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగామంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో రూ.4667 కోట్ల మొత్తంతో 1416 చెక్ డ్యామ్‌లను మంజూరు చేశామని, వాటిలో 860 చెక్ డ్యామ్‌లను ప్రారంభించగా.. 303 చెక్ డ్యాంలను పూర్తికాగా, 548 చెక్‌డ్యామ్‌లు నిర్మాణ దశలో ఉన్నాయని, తొమ్మిది ప్రారంభ దశలోనే ఉన్నాయని తెలిపారు. వీటి ద్వారా ఐదు లక్షల ఎకరాలు పరోక్ష ఆయకట్టుకి లబ్ధి చేకూరుతుందని మంత్రి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News