Monday, December 23, 2024

బైకును ఢీకొట్టి.. యువకుడ్ని 50 మీటర్లు ఈడ్చుకెళ్లిన టాటాఏస్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కరీంనగర్-వరంగల్ ప్రధాన రహదారిపై ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. బైకుపై వెళ్తున్న యువకుడిని టాటా ఏస్ వాహనం ఢీకొట్టింది. బైకును ఢీకొట్టి యువకుడిని 50 మీటర్ల వరకు టాటాఏస్ ఈడ్చూకెళ్లింది. తీవ్రంగా గాయపడిన యువకుడు ఘటనాస్థలంలోనే ప్రాణాలు విడిచాడు. మృతుడిని మిషన్ భగీరథలో పంప్ ఆపరేటర్ గా పనిచేస్తున్న శ్రీకాంత్ గా గుర్తించారు. మృతుడు మానకొండూర్ మండలం కొండపల్కకు చెందిన వాడిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతిదేహాన్ని శవపరీక్ష కోసం మార్చురీకి తరలించారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News