- Advertisement -
తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం స్వామివారిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలిరావడంతో అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్లు లేని భక్తులకు దాదాపు 30 గంటల సమయం పట్టనుంది. నిన్న స్వామివారిని 75,728మంది భక్తులు దర్శించుకున్నారు. 38,092 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. అనంతరం భక్తులు స్వామివారికి మొక్కులు సమర్పించుకున్నారు.ఇక, కానుకల ద్వారా శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.15 కోట్లు వచ్చిందని టిటిడి అధికారులు వెల్లడించారు.
- Advertisement -