సిటీబ్యూరో ః నగర వేదికగా ప్రతిష్టాత్మకంగా ఫార్ములా ఈరేస్ ఛాంపియన్ నిర్వహించడంతో వివిధ ప్రాంతాల నుంచి సెలబిట్రీలు, సినీ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు హాజరై సందడి చేశారు. దీంతో నెక్లెస్‌రోడ్ వీక్షకులతో రద్దీగా మారింది. హుస్సేన్‌సాగర్ చుట్టూ రోడ్లు మూసివేయడంతో వాహానాలను లక్డీకాపూల్ నుంచి ఖైరతాబాద్ మీదుగా పంజాగుట్ట వైపు మళ్లించారు. దీంతో కార్ రేసింగ్ నిర్వహించిన రోజులు నగర వాహనదారులు నరకం చూశారు. నాంపల్లి నుంచి ట్రాఫిక్ దిగ్భందంలో చిక్కుకుని గంటల తరబడి ఆవస్ధలు పడ్డారు. రేసింగ్ నగరం నడి ఒడ్డున నిర్వహించడంపై మండిపడ్డారు.
శనివారం సాయంత్రానికి రేసింగ్ ముగిసిన నెక్లెస్‌రోడు వైపువెళ్లకుండా బారీకేడ్లు ఉంచారు. దీంతో ఆదివారం కూడా వాహనాలు ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్ పోలీసులు ప్రజల సమస్యలు గుర్తించకుండా ఇష్టానుసారంగా వ్యవహరించడం సరికాదని, వాహనదారులు అవస్ధలు పడుతున్న ఎందుకు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కిలోమీటర్ల దూరం వాహనాల మళ్లింపు దారులు పెట్టి పెట్రోల్ వృధా అయ్యేలా చేస్తున్నారని ట్రాఫిక్ పోలీసులపై విరుచుకపడుతున్నారు. ఆదివారం ఇందిరాగాందీ విగ్రహం వద్ద పలువురు ద్విచక్ర వాహనదారులు బారీకేడ్లను తొలగించి ఖైరతాబాద్ చౌరస్తా వైపు వెళ్లారు.